Share News

Viral: పురుషుడి చెప్పులు గది బయట ఉంటే భద్రత! హోటల్స్‌లో ఒంటరి మహిళలకు సూచన

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:51 PM

నిత్యం ఒంటరి ప్రయాణాలు ఓ పర్యాటకురాలు సాటి మహిళల భద్రత కోసం కొన్ని టిప్స్ నెట్టింట పంచుకుంది. మంచి మనసుతో ఆమె చేసిన సూచన ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది.

Viral: పురుషుడి చెప్పులు గది బయట ఉంటే భద్రత! హోటల్స్‌లో ఒంటరి మహిళలకు సూచన

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అనేక దేశాల్లో పర్యాటకం ఊపందుకుంది. దీంతో, ఒంటరిగా కొత్త ప్రదేశాలకు చుట్టి రావాలనుకునే వారి సంఖ్యా పెరుగుతోంది. మహిళలకు ఇలాంటి ప్రయాణాలు కొంత సవాలుతో కూడుకున్నవే. అయితే, ఖర్చు తక్కువ, అధిక స్వేచ్ఛ వంటి కారణాలతో అనేక మంది ఆడామగా అనే తేడాలేకుండా ఒంటరి ప్రయాణాలకు జై కొడుతున్నారు. అయితే, ఇలా నిత్యం ఒంటరి ప్రయాణాలు ఓ పర్యాటకురాలు సాటి మహిళల భద్రత కోసం కొన్ని టిప్స్ నెట్టింట పంచుకుంది. మంచి మనసుతో ఆమె చేసిన సూచన ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది (Viral).

Viral: ఒక్క పైసా కోసం బ్యాంకు దోపిడీ! చివరకు ఏం జరిగిందంటే..


@victorias.way_, అనే ఇన్‌స్టా అకౌంట్‌లో కొన్ని కీలక సూచనలతో కూడిన జాబితాను జత చేసింది. దీని ప్రకారం, ఒంటరిగా ప్రయాణించే మహిళలు..

  • తమ హోటల్ గది ముందు భారీ కాయులైన మగవాళ్ల చెప్పులు ఉంచాలి. తద్వారా లోపల ఎవరో పురుషుడు ఉన్నాడనే భ్రమ కలిగించాలి.

  • గది తలుపుకు డిస్టర్బ్ చేయొద్దు అని సైన్‌ను తగిలించాలి.

  • గది తలుపునకు ఉండే పీప్ హోల్‌ నుంచి లోపల ఉన్నది ఏదీ కనిపించకుండా టిష్యుతో కప్పి ఉంచాలి

  • తలుపు బలవంతంగా తెరిచేందుకు వీలు లేకుండా ఓ ఇనుపు రాడ్డు లోపలి వైపు అడ్డంగా పెట్టాలి

  • తలుపు పగలగొట్టినప్పుడు మోగేలా ఓ అలారమ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి

  • గదిలో ఎవరికీ కనిపించకుండా ఉండేలా ఓ చిన్న కెమెరా కూడా ఉండాలి

  • మన సంభాషణలను రికార్డు చేసే డివైజ్‌లు గది మూలల్లో ఉన్నాయేమో క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి.

అయితే, మహిళ సూచనలకు మాత్రం జనాలు గయ్యిమంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన హోటల్ లో నేను అస్సలు ఉండనంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశారు. నిన్నెవరైనా సీక్రెట్ గా ఫాలో చేస్తున్నట్టైతేనే ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి అని మరో వ్యక్తి పేర్కొన్నారు. ఇంత భయపడే వాళ్లు గడపదాటకుండా ఉంటేనే మంచిదని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 05:51 PM