Share News

Viral: యువతి దారుణం.. రీల్స్ కోసం పసిపాపతో చెలగాటం!

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:59 PM

చంటిపాను ఎత్తుకుని పొగతాగుతూ షార్ట్ వీడియోకు పోజులిచ్చి ఓ యువతిపై నెట్టింట ఆగ్రహం పెల్లుబుకుతోంది. చిన్నారి ఆరోగ్యంతో చెలగాటమాడిన యువతిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Viral: యువతి దారుణం..  రీల్స్ కోసం పసిపాపతో చెలగాటం!

ఇంటర్నెట్ డెస్క్: రీల్స్, షార్ట్ వీడియోల కోసం యువత ఇటీవల కాలంలో నానా రచ్చ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో, ప్రజారవాణా సాధనాల్లో డ్యాన్స్‌లు చేస్తూ రెచ్చిపోతుంటారు కొందరు. మరికొందరేమో ప్రాంక్ వీడియోల పేరిట విసుగు తెప్పిస్తుంటారు. అయితే, షార్ట్ కోసం కొందరు ఏ చేసేందుకైనా వెనకాడరని రుజువు చేస్తే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ (Viral) అవుతోంది. ఓ వీడియోలో ఓ యువతి ఏకంగా చిన్నారి ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఇది చూసి జనాలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.

Viral: భర్త కోసం తెల్లవారుజామున తానేంచేసేది చెప్పిన వివాహిత.. నెటిజన్లకు షాక్!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ యువతి నెలల వయసున్న ఓ బాలుడిని ఎత్తుకుని షార్ట్ వీడియో చేసింది. ఇదిచాలదన్నట్టు ఓ చేత్తో బాలుడిని ఎత్తుకుని మరో చేత్తో సిగరెట్ తాగింది. దీంతో, పొగ కారణంగా చిన్నారి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. పొగ ఘాటుకు దగ్గడం ప్రారంభించాడు. ఇంత జరుగుతున్నా యువతి మాత్రం తన మానాన తాను సిగరెట్ తాగుతూ వీడియోకు పోజులిచ్చింది (Internet reacts in anger as woman smokes holding uncomfortable child).


ఈ వీడియోలో ఈ దారుణాన్ని చూసిన జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి యువతి పెడదారి పడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారికి ముందు పొగతాగాలన్న ఆ ఆలోచన యువతికి ఎలా వచ్చిందో అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పసిపిల్లలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేశారు. ఆ బిడ్డ తల్లి ఏం చేస్తోందని కొందరు ప్రశ్నిస్తే.. ఆ యువతే చిన్నారి తల్లి అయితే యువతరం సోషల్ మీడియాకు బలైపోయినట్టుగా భావించాలని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Updated Date - Jun 18 , 2024 | 05:39 PM