Share News

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరో సూచన.. విమర్శలు మళ్లీ షురూ!

ABN , Publish Date - Sep 12 , 2024 | 07:22 PM

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తిపై మరోసారి నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల పెంపకంపై ఆయన చేసిన సూచనలతో జనాలు విభేదిస్తున్నారు.

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరో సూచన.. విమర్శలు మళ్లీ షురూ!

ఇంటర్నెట్ డెస్క: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తిపై మరోసారి నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల పెంపకంపై ఆయన చేసిన సూచనలతో జనాలు విభేదిస్తున్నారు (Viral).

బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణ మూర్తి (Narayana Murthy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల పెంపకంపై పలు సూచనలు చేశారు. పిల్లలకు చదువుకునేందుకు అనువైన క్రమశిక్షణాపూర్వక వాతావరణాన్ని ఇంట్లో నెలకొల్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని ఆయన అన్నారు. పిల్లలకు చదువుపై శ్రద్ధ పెట్టాలని చెబుతూ తల్లిదండ్రులు సినిమాలు చూస్తే ఫలితం ఉండదని అన్నారు. తనూ, సుధామూర్తి ప్రతి రోజూ పిల్లలతో కలిసి మూడున్నర గంటల పాటు పుస్తక పఠనంలో గడిపేవారమని అన్నారు. క్రమశిక్షణాపూర్వక వాతావరణం నెలకొల్పడంలో భాగంగా ఇలా చేసేవారమని తెలిపారు. ‘‘నేను టీవీ చూస్తూ పిల్లలకు చదువుకోమని చెప్పడం ఏంటని సుధా మూర్తి అనేది. కాబట్టి, తానూ టీవీ త్యాగం చేస్తానని చెప్పేది’’ అని ఆయన వివరించారు.

Viral: నేటి తరం చిన్నారులు ఎలా ఉన్నారో తెలుసా? వీడియో చూస్తే షాక్ పక్కా!


ఈ వ్యాఖ్యలు యథావిధిగా వైరల్ కాగా జనాలు మళ్లీ విమర్శలకు దిగారు. వారంలో 70 గంటలు పని చేసే తల్లిదండ్రులు పిల్లల కోసం మూడున్నర గంటల పాటు పుస్తకపఠనానికి కేటాయించగలరా? అని ప్రశ్నించారు. ఈ సూచన వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందని కొందరు అన్నారు. నేటి తరం తల్లిదండ్రులు పలు బాధ్యతలతో నిత్యం తీరిక లేకుండా గడుపుతున్నారని కొందరు చెప్పారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడమంటే తల్లిదండ్రులు తమ వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేయడం కాదని అన్నారు. సమతౌల్యం సాధించడమే ఇక్కడ కీలకమని చెప్పుకొచ్చారు. పిల్లలతో కలిసి పుస్తకాలు చదివే బదులు వారికే పుస్తకాలు కొనిచ్చి చదువుకోమని ప్రోత్సహించాలని అన్నారు.

Viral: డైవర్స్ తీసుకున్న మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండీషన్స్.. జనాలకు షాక్!


కెరీర్‌లో ముందుకెళ్లేందుకు వారానికి 70 గంటలు పనిచేయడానికి కూడా వెరవకూడదన్న సూచన చేసి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇటీవల విమర్శలపాలైన విషయం తెలిసిందే. తాను ఉదయం 6.20కి బయటకెళ్లి రాత్రి 8.30కు వచ్చే వాణ్ణని ఆయన అన్నారు. తన 40 ఏళ్ల కెరీర్‌లో సగటున వారానికి 70 గంటలు పని చేశానని, తొలి నాళ్లల్లో ఏకంగా వారానికి 90 గంటల వరకూ పని చేశానని తెలిపారు. అయితే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటూ నెటిజన్లు ఆయన సూచనపై విమర్శలు గుప్పించారు.

Viral: ఆత్మహత్యాయత్నం.. రైలు రావడం ఆలస్యమయ్యేసరికి పట్టాలపైనే కునుకు!

Read Latest and Viral News

Updated Date - Sep 12 , 2024 | 07:27 PM