Share News

Viral: ఈ పిల్లాడు ఎంత పని చేశాడో చూడండి.. ఐపీఎస్ అధికారికి షాక్!

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:01 PM

ఇద్దరు మైనర్ బాలురు బైక్ నడుపుతున్న వీడియోను ఐపీఎస్ అధికారి షేర్ చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.

Viral: ఈ పిల్లాడు ఎంత పని చేశాడో చూడండి.. ఐపీఎస్ అధికారికి షాక్!
Minor Driving bike

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపిల్లలపై నిత్యం ఓ కన్నేసి ఉండాలని సూచిస్తూ ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ నెట్టంట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. వీడియోలో బాలుడు చేసిన పనికి ఐపీఎస్ అధికారితో పాటు నెటిజన్లు షాకైపోయారు.

Viral: ఇంత నీచానికి ఎందుకు దిగజారుతారో? ఈమె 10వ తరగతి స్టేట్ ర్యాంకర్ అని తెలిసినా..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మైనర్ బాలుడు బైక్ నడిపేందుకు ట్రై చేసి అందర్నీ హడలెత్తించాడు. తొలుత అతడు కాళ్లు అందకపోయిన బైక్ ఎక్కాడు. బండిని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా పలు మార్లు కిక్ కొట్టాడు. బండి స్టార్ట్ కాకపోవడంతో అక్కడే ఉన్న అతడి స్నేహితుడు బండి కిక్ కొట్టాడు. ఆ తరువాత అతడు ఎలాగొలా బైక్ వెనక సీటుపై కూర్చుకున్నాడు. ఈ లోపు బండి కూడా స్టార్టవడంతో ముందు సీటుపై ఉన్న బాలుడు తడబడుతూ బైక్ నడపడం ప్రారంభించాడు (Minor drives bike). ఆ తరువాత ఏం జరిగిందనేది వీడియోలో లేకపోయినా జనాలు మాత్రం బాలురు చేసిన పనికి షాకైపోతున్నారు.


‘‘ఇంతకంటే ప్రమాదకరమైన చర్య మరొకటి ఉందా? తల్లిదండ్రులారా.. జాగ్రత్త మీ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి’’ అని వీడియో షేర్ చేస్తూ ఐపీఎస్ అధికారి కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా ఇదే సలహా ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడిపితే ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయని (Road Safety), తమ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు.

Read Latest Offbeat and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 04:10 PM