Share News

Viral Video: ఆమె మనిషా? రోబోనా? చైనా రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:21 PM

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్లకు వెళితే అమ్మాయిలు లేదా అబ్బాయిలు చక్కగా డ్రెస్ చేసుకుని మనకు ఆహార పదార్థాలను వడ్డిస్తారు. మనకు సకల మర్యాదలూ చేస్తారు. చైనాలోని ఓ రెస్టారెంట్‌లో కూడా ఓ మహిళా వెయిటర్ అలాగే సేవలు చేస్తోంది. అయితే ఆమె మనిషా? రోబోనా? అని వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: ఆమె మనిషా? రోబోనా? చైనా రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్!
Is she a robot or a human?

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్లకు (Restaurant) వెళితే అమ్మాయిలు లేదా అబ్బాయిలు చక్కగా డ్రెస్ చేసుకుని మనకు ఆహార పదార్థాలను వడ్డిస్తారు. మనకు సకల మర్యాదలూ చేస్తారు. చైనాలోని ఓ రెస్టారెంట్‌ (Chinese restaurant)లో కూడా ఓ మహిళా వెయిటర్ (Waitress) అలాగే సేవలు చేస్తోంది. అయితే ఆమె మనిషా? రోబో (Robo)నా? అని వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆమెను చాలా మంది హ్యూమనాయిడ్ రోబో (Humanoid robot)గా, ఐఏ వెయిట్రస్‌గా పేర్కొంటున్నారు. అయితే ఆమె రోబో కాదు. నిజమైన మహిళ. చైనాలోని ఓ రెస్టారెంట్‌లో రోబో వెయిట్రస్‌గా సేవలు అందిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


asian_technology అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ రెస్టారెంట్‌లో చిత్రీకరించారు. రెడ్ గౌన్ ధరించిన ఓ మహిళ అక్కడ వెయిట్రస్‌గా పని చేస్తోంది. ఆమె, ఆమె కదలికలు అచ్చం చూడడానికి రోబోలాగానే ఉన్నాయి. అమె చేతులు, కాళ్లు, మొహం, కళ్లు కదిలిస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఆమె రోబో అని నమ్మక తప్పదు. అయితే అద్భుతమైన ట్యాలెంట్‌తో ఆ మహిళ తనను తాను రోబోలా ఆవిష్కరిస్తోంది. ఆమె నిజమైన మహిళ అని చెప్పకపోతే కచ్చితంగా రోబో అనే చాలా మంది అనుకుంటారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 1.3 లక్షల మందికి పైగా ఈ వీడియను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజంగా అద్భుం``, ``ఆమె హ్యూమన్. రోబో‌కు రోబోలా నటించాల్సిన అవసరం లేదు``, ``హ్యూమనాయిడ్ రోబోలా నటిస్తూ ఆమె కస్టమర్లను ఆహ్వానిస్తోంది``, ``ఇది కేవలం కస్టమర్ల వినోదం కోసం మాత్రమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ వధువును కిడ్నాప్ చేస్తున్నారా? అత్తింటికి తీసుకెళ్తున్నారా? స్కూల్‌కెళ్లే పిల్లలా ఎలా ఏడుస్తోందో చూడండి..


Viral Video: ఈ బ్రెయిన్‌కు అవార్డు ఇవ్వాల్సిందే.. ఏసీ వాటర్‌ను ఉపయోగించి ఏం చేస్తున్నాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2024 | 02:51 PM