Share News

Eye Health: కంటి ఆరోగ్యం కోసం వివిధ వయసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:58 PM

సర్వేద్రియాణం నయనం ప్రధానం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి, కంటి విషయంలో వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వయసును బట్టి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Eye Health: కంటి ఆరోగ్యం కోసం వివిధ వయసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఇంటర్నెట్ డెస్క్: సర్వేద్రియాణం నయనం ప్రధానం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి, కంటి విషయంలో వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వయసును బట్టి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రెగ్యులర్ చెకప్‌లు అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు (Health).

Indoor Pollution: ఎక్కువ సేపు వంటగదిలో గడుపుతున్నారా? ఎంతటి రిస్కొ తెలిస్తే..


చిన్నాలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

చిన్న పిల్లలు తమ దృష్టిలోపాలను సరిగా చెప్పలేరు. కాబట్టి, తల్లిదండ్రులే వారిపై ఓ కన్నేసి ఉంచాలి. హ్రస్వదృష్టి, దూరదృష్టితో పాటు ఆస్టిగ్మాటిజమ్ వంటి సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వారిపై ఓ కన్నేసి ఉంచాలని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలను తొలిదశలోనే గుర్తించగలిగితే పిల్లలు పెద్దయ్యా అవి ముదరకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Intermittent Fasting: ఈ తరహా ఉపవాసంతో జుట్టుకు చేటు!

ఇక 20ల్లో, 30ల్లో ఉన్న వారు తమ కంటి ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవాలి. డిజిటల్ డివైజ్‌ల వాడకాలు ఎక్కువైన నేటి తరుణంలో యువత, మధ్య వయసు వారు క్రమం తప్పకుండా కంటి చెకప్‌లు చేయించుకోవాలి. చూపును కాపాడుకునేందుకు 20-20-20 రూల్ ఫాలో కావాలి. అంటే.. 20 నిమిషాలకోసారి స్క్రీన్‌ల నుంచి దృష్టి మరల్చి కనీసం 20 అడుగుల దూరాన ఉన్న వస్తువులపై 20 సెకెన్ల పాటు చూపు నిలపాలి. ఇలా చేస్తే కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక గ్లకోమా, కాటరాక్ట్ లాంటి సమస్యలు ఎటువంటి సంకేతాలు లేకుండా కబళిస్థాయి కాబట్టి ప్రతి రెండేళ్ల కోసారి తప్పనిసరిగా కంటి చెకప్ చేయించుకోవాలి.

Health: ఆరోగ్యవంతుల్లోనూ కార్డియాక్ అరెస్టు! కారణాలు ఇవే..


ఇక వృద్ధుల్లో కంటి సమస్యలకు అవకాశం ఎక్కువ. కాటరాక్ట్‌తో పాటు మాక్యులర్ డీజెనరేషన్, గ్లకోమా వంటివి చూస్తండగానే ముదిరి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వృద్ధులు ఏడాదికోసారి తప్పనిసరిగా కంటి చెకప్‌కు వెళ్లాలి. ఈ జాగ్రత్తలతో పాటు సర్జరీలతో వృద్ధుల్లో తలెత్తే అనేక సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు. అయితే, వయసు ఏదైనా తరచూ కంటి చెకప్‌లు చేయించుకోవడమే శ్రీరామ రక్ష అని అంటున్నారు.

Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!

Read Latest and Health News

Updated Date - Dec 22 , 2024 | 05:58 PM