Share News

Viral: రేయ్..ఎవర్రా మీరంతా.. పుచ్చకాయల్ని ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే..

ABN , Publish Date - May 20 , 2024 | 09:36 PM

పుచ్చకాయలు బాగా పండినట్టు కనిపించేందుకు ఎరిత్రోసిన అనే రంగును వాటిల్లోకి ఇంజెక్ట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలను షాక్ కు గురి చేస్తోంది.

Viral: రేయ్..ఎవర్రా మీరంతా.. పుచ్చకాయల్ని ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే..
Watermelon Adulteration

ఇంటర్నెట్ డెస్క్: ఇది ఎండాకాలం.. మామిడి, పుచ్చకాయల సీజన్. వీటికి పెరుగుతున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులూ రంగంలోకి దిగారు. పండ్లను కూడా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. తమ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పుచ్చకాయల్ని ఎలా చేస్తున్నారో చెప్పే వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు. అక్రమార్కులు మరీ ఇంతలా తెలివి మీరిపోయారేంటంటూ షాకైపోతున్నారు.

Viral: పెళ్లిలో వరుడిని చితక్కొట్టిన వధువు మాజీ బాయ్‌ఫ్రెండ్.. షాకింగ్ వీడియో

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి పుచ్చకాయలోకి ఇంజెక్షన్ ద్వారా ఎర్ర రంగును ఎక్కించాడు. ఇలా చేస్తే పుచ్చకాయ లోపల బాగా పడినట్టు ఉంటుందట. తీయ్యదనం పెరుగుతుందట. చాలా రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందట. తెలిసీతెలీకుండా పండును కొనేస్తే ఆరోగ్యం పాడుచేసుకున్నట్టేనని ఈ వీడియో చూసిన పలువురు హెచ్చరిస్తున్నారు. నిపుణుల చెప్పేదాని ప్రకారం, పుచ్చకాయల్లో ఎరిత్రోసిన్ - బీ అనే రంగును సూది ద్వారా ఎక్కిస్తారు. ఇది పండులోపలి రంగును మరింత గాఢంగా మారుస్తుంది (watermelon adulteration in Viral Video).


అయితే, ఇలాంటి నకిలీ పుచ్చకాయలను గుర్తించేందుకు ఓ సింపుల్ ట్రిక్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. నకిలీలను గుర్తించేందుకు ముందుగా పుచ్చకాయను చాకుతో రెండు ముక్కలు చేయాలి. ఆ తరువాత దూది తీసుకుని పుచ్చకాయ గుజ్జుపై రాయాలి. దూదికి గనుక ఎర్రని రంగు అంటుకుంటే పుచ్చకాయ కల్తీ అయినట్టే భావించాలి. దూదికి రంగు మారకుండా ఉంటే కల్తీ కాలేదని నమ్మెచ్చు. ఇక మామిడి పండ్లను త్వరగా మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు కార్బైడ్ వాడుతున్నారు. కార్బైడ్ తో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఆహార నియంత్రణ సంస్థ రంగంలోకి దిగింది. కార్బైడ్ వాడితే చర్యలు తప్పవంటూ వ్యాపారులను హెచ్చరించింది.

Read Viral and Telugu News

Updated Date - May 20 , 2024 | 09:45 PM