Share News

Viral: చోరీకొచ్చి పురాణం చదువుతూ లోకం మర్చిపోయిన దొంగ.. చివరకు..

ABN , Publish Date - Aug 26 , 2024 | 09:03 PM

చోరీ కొచ్చిన ఓ ఇటలీ దొంగ ఆ విషయాన్నే మర్చిపోయి గ్రీకు పురాణం చదవడంలో మునిగిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: చోరీకొచ్చి పురాణం చదువుతూ లోకం మర్చిపోయిన దొంగ.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: దొంగల వింత పనుల గురించి గతంలో అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు చోరీకొచ్చి ఏసీ గదిలో నిద్రపోతే మరికొందరేమో ఏకంగా దేవుడికి దండం పెట్టి మరీ గుళ్లల్లో చోరీ చేశారు. అయితే, తాజా దొంగ వీరందరికంటే డిఫరెంట్! చోరీకొచ్చిన అతడు ఆ విషయాన్ని పక్కన పెట్టి పుస్తకపఠనంలో మునిగిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. రోమ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) కొనసాగుతోంది.

Viral: ఇండిగోపై ప్యాసెంజర్ ఆగ్రహం! రూ.45 వేల వస్తువులు పోగొట్టింది చాలక..


ఇటలీ మీడియా కథనాల ప్రకారం, ప్రాతీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దొంగ బాల్కనీ ద్వారా ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. అక్కడో గదిలో బెడ్‌ పక్కన ఉన్న టేబుల్‌పై గ్రీకు పురాణానికి సంబంధించిన పుస్తకం కనిపించింది. పుస్తకంవైపు ఆకర్షితుడైన అతడు అది చదువుతూ లోకాన్నే మర్చిపోయాడు. తాను వచ్చిన పనిని పక్కన పెట్టేసి పుస్తకంలో మునిగిపోయాడు. ఈలోపు ఇంటి ఓనర్‌కు మెళకువ రావడంతో దొంగ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తరువాత వచ్చిన దారినే ఆ ఫ్లాట్‌ నుంచి బయటపడ్డాడు. ఈ వింత దొంగ గురించి పోలీసులకు అప్పటికే సమాచారం అందడంతో అతడు వారికి చిక్కాడు. అయితే, తాను హోటల్‌లోకి వచ్చానని అనుకున్నానని దొంగ పోలీసులతో చెప్పాడు. పుస్తకం కనబడగానే దాన్ని చదువుతూ ఉండిపోయానని చెప్పాడు (Italian Thief Puts Stealing On Hold To Read A Book About Greek Mythology Caught).


కాగా, ఈ ఘటనపై పుస్తక రచయిత కూడా స్పందించారు. ‘‘ఇది నిజంగా అద్భుతమే. ఆ దొంగ ఎవరో కనుక్కుని అతడిని నా పుస్తకం ఇవ్వాలని ఉంది. అతడు నా పుస్తకం పూర్తిగా చదివి ఉండడు. ఈ లోపే పోలీసులకు దొరికిపోయి ఉంటాడు. కాబట్టి, పుస్తకాన్ని పూర్తిగా చదివే అవకాశాన్ని అతడికి ఇవ్వాలనుకుంటున్నా. ఇది నిజంగానే వింత ఘటన. మనిషిలోని విభిన్న కోణాలను స్పృశించింది’’ అని ఆయన వ్యాఖ్యానించాడు.

కాగా, పుస్తకంలో పడి రెడ్ హ్యాండెడ్‌గా దొరకక మునుపు ఆ దొంగ మరో చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద ఉన్న బ్యాగులో ఖరీదైన దుస్తులను గుర్తించారు. ఇక వింత దొంగ ఉదంతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ead Viral and Telugu News

Updated Date - Aug 26 , 2024 | 09:13 PM