Share News

Facebook Love: ఆమెకు 78.. అతనికి 34.. ఫేస్‌బుక్‌లో కలిశారు.. చివరకు ఏమైందంటే?

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:15 PM

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమేనని నిరూపిస్తూ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 30 నుంచి 40 ఏళ్ల వయసు తేడా ఉన్నా.. కొందరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న...

Facebook Love: ఆమెకు 78.. అతనికి 34.. ఫేస్‌బుక్‌లో కలిశారు.. చివరకు ఏమైందంటే?
Facebook Love

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమేనని నిరూపిస్తూ కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 30 నుంచి 40 ఏళ్ల వయసు తేడా ఉన్నా.. కొందరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే ఒకటి వెలుగు చూసింది. తమ మధ్య 44 ఏళ్ల వయసు తేడా ఉన్నా.. ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో విషయం ఏమిటంటే.. వాళ్లు ఫేస్‌బుక్ (Facebook Love) ద్వారా కలిశారు. పైగా ఆమె తన ప్రేమ కోసం అమెరికా (America) నుంచి భారత్‌కు రావడం మరో విశేషం. అయితే.. వీరి కథ చివరకు విషాదాంతంగా ముగిసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


అమెరికాలోని టెక్సాస్‌లో నివసించే జాక్వెలిన్ ఆస్టిన్ (Jacueline Austin) (78) అనే వృద్ధురాలికి భారత్‌కు చెందిన భరత్ జోషితో (Bharath Joshi) (34) ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆస్టిన్ తన కన్నా 44 ఏళ్లు పెద్దదైనా.. ఆమె ప్రేమను జోషి అంగీకరించాడు. దీంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా.. ఆస్టిన్ అమెరికా నుంచి భారత్‌కు వచ్చేసింది. రాజస్థాన్‌లోకి కోటాకు వచ్చి.. గతేడాది ఆగస్టులో తన ప్రియుడు భరత్ జోషిని వివాహమాడింది. కోటాలోని స్థానిక కోర్టులో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. భారత్‌కు వచ్చిన తర్వాత అమెరికాలోని తన కుటుంబ సభ్యులతో ఆస్టిన్ టచ్‌లోనే ఉండేది.


అయితే.. ఈ ఏడాది జులై ఆస్టిన్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో.. జోషి ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందించినా.. ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. దీంతో.. వైద్యుల సూచన మేరకు ఆమెను జైపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆస్టిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు కానీ.. సోమవారం ఆమె తుదిశ్వాస విడిచింది. ఆమె మృతదేహాన్ని న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోని మార్చురీలో ఉంచారు. నిబంధనల ప్రకారం.. తదుపరి ప్రక్రియలను కొనసాగించారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 08:15 PM