Share News

Viral: కొండముచ్చు ఎంత పని చేసింది.. బాలిక వెనక నుంచి సడెన్‌గా.. షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:55 PM

భవనంలోంచి బయటకు వస్తున్న ఓ బాలికపై వెనక నుంచి కోతి దాడి చేసిన భయానక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకయ్యేలా చేస్తోంది.

Viral: కొండముచ్చు ఎంత పని చేసింది.. బాలిక వెనక నుంచి సడెన్‌గా.. షాకింగ్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: జనావాసాలు విస్తరిస్తున్న కొద్దీ అడవులు తరిగిపోతూ జంతువులు జనారణ్యాల్లోకి వచ్చేస్తున్నాయి. చివరకు దాడులకు కూడా తెగబడుతున్నా్యి. ఇలాంటి ఘటనల్లో కొన్ని గగుర్పొడిచే రీతిలో ఉంటూ నెట్టింట వైరల్ (Viral) అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లు భయభ్రాంతులకు గురి చేస్తోంది. షాకైపోయేలా చేస్తోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువతి భవనంలోంచి బయటకు వస్తుండగా ఓ కొండముచ్చు అకస్మాత్తుగా దాడి చేసింది. వెనక నుంచి సైలెంట్‌గా వచ్చిన అది, బాలిక కాలుపట్టుకుని కొరికేసింది. కొండముచ్చును తరిమికొట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన బాలిక చివరకు బ్యాలెన్స్ తప్పి కిందపోయింది. పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేసింది. అదృష్టవశాత్తూ కొండముచ్చు భయపడి పారిపోవడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి. చివరకు నెట్టింట వైరల్‌గా మారాయి (This Video Of Monkey Attacking Girl At Parking Lot Is Terrifying).

Viral: విమానంలో టీ ఒలకడంతో గాయాలు! రూ.12 కోట్ల పరిహారం కోరుతూ కేసు!


వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు. ఇవి నిజంగా భయానక దృశ్యాలంటూ కామెంట్ చేస్తున్నారు. బాలిక క్షేమంగా ఉండాలని కొందరు ఆకాక్షించారు. తామూ గతంలో ఇలాంటి దాడులను ఎదుర్కొన్నట్టు కొందరు చెప్పాడు. ముసలితనంలో ఉన్న ఓ పెంపుడు కుక్కకు మతి భ్రమించి పొరుగింట్లో ఉంటున్న ఓ వ్యక్తిని కొరికిందని కొందరు అన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయని కొందరు విచారం వ్యక్తం చేశారు. పెంపుడు జంతువులు, క్రూర జంతువులు అన్న తేడా లేకుండా అన్నీ మనుషుల మీద ఎగబడుతున్నాయని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 04:56 PM