Share News

Viral Video: రోడ్డు పక్కన ప్రేమికుల రొమాన్స్.. కారులో వెళ్తూ కూతురిని చూసిన తండ్రి.. చివరకు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:01 PM

బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తించడం రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరు ప్రేమికులు వాహనాలపై వెళ్తూ ముద్దులు పెట్టుకుంటుంటే.. మరికొందరు పార్కుల్లో అందరి ముందే హద్దుల దాటి ప్రవర్తించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి...

Viral Video: రోడ్డు పక్కన ప్రేమికుల రొమాన్స్.. కారులో వెళ్తూ కూతురిని చూసిన తండ్రి.. చివరకు..

బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తించడం రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరు ప్రేమికులు వాహనాలపై వెళ్తూ ముద్దులు పెట్టుకుంటుంటే.. మరికొందరు పార్కుల్లో అందరి ముందే హద్దుల దాటి ప్రవర్తించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట రోడ్డు పక్కన బస్టాండ్‌లో సరసాలు ఆడుతుండగా.. అదే సమయంలో కారులో అటుగా వచ్చిన యువతి తండ్రి కంటపడింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట రోడ్డు పక్కన బస్టాండ్‌లో కలుసుకుంది. అంతటితో ఆగని ఆ జంట.. అందరి ముందూ బస్టాండ్‌లోనే సరసాలు ఆడటం మొదలెట్టింది. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించకుని, ముద్దులు (Lovers kissing in public) పెట్టుకోవడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంతలో యువతి తండ్రి కారులో అటుగా వచ్చాడు.

Viral Video: ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో.. కారును ఎలా రివర్స్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవడం ఖాయం..


తన కూతురును ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యాడు. వెంటనే కారు ఆపి వారి వద్దకు వెళ్తాడు. సడన్‌గా తండ్రి రావడాన్ని చూసి కూతురు షాక్ అవుతుంది. అక్కడికి వచ్చిన తండ్రి కూతురును లాక్కుని వెళ్లి బలవంతంగా కారులో కూర్చోబెడతాడు. తర్వాత యువకుడి వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై ఫెడేల్‌మని కొడతాడు. చాలా సేపు బూతులు తిడుతూ అతన్ని మందలిస్తాడు.

Viral Video: నట్టు, బోల్టును ఇలాక్కూడా వాడొచ్చా.. తలుపులతో ఇతడు చేసిన ప్రయోగం చూడండి..


ఈ క్రమంలో తన కుమార్తె పైకూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరగా యువకుడికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ప్రేమజంట మరీ దారుణంగా ప్రవర్తింస్తోంది’’... అంటూ కొందరు, ‘‘ఈ తండ్రి బాగానే బుద్ధి చెప్పాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పదే పదే హారన్ కొడుతున్నా.. పట్టాల నుంచి తప్పుకోని వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - Jul 16 , 2024 | 07:01 PM