Share News

Viral: ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతికి షాక్!

ABN , Publish Date - Nov 14 , 2024 | 03:31 PM

బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టర్మినల్ 2 ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా దీని నిర్మాణ శైలి, టర్మినల్ లోపలి ఏర్పాట్లు విదేశీ ప్రయాణికులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా జపాన్ యువతి బెంగళూరు ఎయిర్‌పోర్టు టర్మినల్ 2 చూసి ఆశ్చర్యపోయింది.

Viral: ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతికి షాక్!

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టర్మినల్ 2 ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా దీని నిర్మాణ శైలి, టర్మినల్ లోపలి ఏర్పాట్లు విదేశీ ప్రయాణికులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా జపాన్ యువతి బెంగళూరు ఎయిర్‌పోర్టు టర్మినల్ 2ను చూసి ఆశ్చర్యపోయింది. ఏంటీ.. ఇది ఇండియన్ ఎయిర్ పోర్టేనా అని ఆశ్చర్యపోతూ ఆమె పంచుకున్న వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Viral).

Viral: ఎంత మోసం.. మంచానపడ్డ భర్తకు సేవలు చేసి కోలుకునేలా చేస్తే..


కీకీ చెన్ అనే జపాన్ యువతి టర్మినల్ 2 నిర్మాణ శైలి ఏర్పాట్లకు ముగ్ధురాలైపోయింది. ‘‘ఇండియాలోని అత్యద్భుత ఎయిర్‌పోర్టు టర్మినల్ ఇదే’’ అంటూ ఆమె వీడియోలో కామెంట్ చేసింది. ఎయిర్‌పోర్టులో లాండవగానే ఆమెను మొదట టర్మినల్ 2 నిర్మాణ శైలి ఆకట్టుకుంది. అక్కడి లాంజ్, వెయిటింగ్ ప్రాంతాలు, ఫుడ్ స్టాల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చింది. టర్మినల్ లోపలి అలంకరణ కోసం వెదురును వాడటం ఆమెను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా చెకింగ్ కౌంట్లర్లు కూడా ఇలాగే డిజైన్ చేయడం చూసి ఆమె నోరెళ్లబెట్టింది. ‘‘ఇది ఇండియాలోని ఎయిర్‌పోర్టు అంటే నమ్మలేకపోతున్నా’’ అని వ్యాఖ్యానించింది.

Viral: జపాన్ వీధుల పరిశుభ్రతను పరీక్షించిన భారతీయ యువతి! రిజల్ట్స్‌ చూసి షాక్

కాగా, ఈ ఎయిర్‌పోర్టు‌లో రెండవ టర్మినల్ డిజైన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అత్యంత అందమైన ఎయిర్‌‌పోర్టుల్లో ఒకటిగా బెంగళూరు విమానాశ్రయాన్ని యూనెస్కోలోని ప్రీ వర్సాలిస్ అనే ఆర్కిటెక్చురల్ జ్యూరీ గుర్తించింది. అంతేకాకుండా, అత్యత్భుత ఇంటీరియర్స్ డిజైన్‌కు గాను స్పెషల్ ప్రైజ్ ఫర్ ఇంటీరియర్‌ గుర్తింపును కూడా ఈ టర్మినల్ సొంతం చేసుకుంది. దేశీయ ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు ఈ టర్మినల్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.


ప్రయాణికులకు ఓ సంపూర్ణమైన ప్రయాణానుభూతిని ఇచ్చేందుకు రూ. 5 వేల కోట్లతో దీన్ని నిర్మించారు. లోపలి ప్రదేశమంతా పచ్చని తోటలను మరిపించేలా ఇంటీయర్స్‌ను డిజైన్ చేశారు. దీన్ని నగరానికి తలమానికంగా అనేక మంది అభివర్ణిస్తారు. ఇక్కడకు వస్తే ఉద్యానవనంలో ఉన్నట్టు ఉంటుందని అనేక మంది ప్రయాణికులు తమ అనుభవాలను నెట్టింట పంచుకున్నారు. ఈ టర్మినల్ మొత్తం వైశాల్యం 10 వేల పైచిలుకు చదరపు మీటర్లు . ఈ ఏర్పాట్లన్నీటికీ స్వదేశీ సాంకేతికతను వినియోగించడం కొసమెరుపు.

Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన

Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం

Read Latest and Viral News

Updated Date - Nov 14 , 2024 | 03:39 PM