Share News

Viral: వావ్.. టాటాల రూ.7 వేల కోట్ల ఆఫర్‌ను కాదన్న ఈమె ఎవరో తెలిస్తే..

ABN , Publish Date - Nov 19 , 2024 | 07:15 PM

తండ్రి స్థాపించిన బిస్లరీ సంస్థను ముందుకు తీసుకెళుతున్నారు జయంతీ చౌహాన్. సంస్థ కొనుగోలు కోసం టాటాలు ఏకంగా రూ.7 వేల కోట్లు ఆఫర్ చేసినా కాదన్న ఆమె సంస్థ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

Viral: వావ్.. టాటాల రూ.7 వేల కోట్ల ఆఫర్‌ను కాదన్న ఈమె ఎవరో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: జయంతీ చౌహాన్.. ఈ పేరు ఎక్కడా విన్నట్టు లేదు కదూ! కానీ బిస్లరీ పేరును కచ్చితంగా వినే ఉంటారు కదూ! మినరల్ వాటర్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థను ప్రస్తుతం ముందుండి నడిపిస్తున్నది జయంతీ చౌహానే! వ్యాపార వర్గాలు మినహా సామాన్యులకు పెద్దగా పరిచయం లేని ఈ యువ వ్యాపారవేత్త బిస్లరీ బిజినెస్‌ను కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఒకప్పుడు బిస్లరీని చేజిక్కించుకునేందుకు టాటాలు ఏకంగా రూ.7 వేల కోట్లు ఆఫర్ చేసిన కాదన్న ధీశాలి జయంతీ. మరి జయంతి ఎవరో..ఆమె జర్నీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).

Viral: దేవత అంటే ఈమెనే! లాటరీలో గెలిచిన రూ.121 కోట్లతో..

బిస్లరీ సంస్థ అధినేత రమేశ్ చౌహాన్ ఓ సందర్భంలో తన వ్యాపారాన్ని అమ్మేద్దామనుకున్నారు. టాటాలతో చర్చలు కూడా మొదలైనట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అప్పట్లో టాటాలు రూ.7 వేల కోట్లు ఆఫర్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అలాంటి సమయంలో ఆయన కూతురు జయంతీ చౌహాన్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కొంత కాలానికే టాటాలు ఈ చర్చల నుంచి ఉపసంహరించుకున్నారు. తన తండ్రి స్థాపించిన సంస్థను విక్రయించేందుకు జయంతి విముఖత చూపడంతో ఆ డీల్ మధ్యలోనే ఆగిపోయినట్టు సమాచారం.

Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!


24 ఏళ్ల వయసులో జయంతి బిస్లరీ సంస్థలో కాలుపెట్టారు. ఢిల్లీ కార్యాలయంలో విధులు ప్రారంభించిన ఆమె క్రమంగా సంస్థ కార్యకలాపాలపై అవగాహన పెంచుకుని పట్టుసాధించారు. సంస్థ కార్యకలాపాల్లో ఆధునికత జొప్పించేందుకు, తమ కర్మాగారాల్లో పలు కార్యకలాపాలు తమంతట తాముగా సాగేలా ఆటోమేషన్‌పై దృష్టిపెట్టారు. జయంతి చిన్నతనం ఢిల్లీతో పాటు ముంబై, న్యూయార్క్ నగరంలో కూడా గడిచింది. దీంతో, చిన్నప్పుడే ఆమెకు విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు పరిచయమయ్యాయి. లాస్‌ ఏంజిలిస్‌లోని ఫ్యాషన్ డిజైన్ అండ్ మెర్చెండైజింగ్‌లో చదివిన ఆమెపై ఆ తరువాత ప్రాడక్ట్ డవలప్‌మెంట్‌ అధ్యయనం చేసింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇంటర్న్‌గా చేసిన ఆమె కీలక వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు.

Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు


ఇక 2011 నాటికి ఢిల్లీతో పాటు ముంబై శాఖ కార్యకలాపాలు కూడా జయంత్రి పర్యవేక్షణలోకి వెళ్లాయి. ఆమె సారథ్యంలో బిస్లరీ కార్యకలాపాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అడ్వర్‌టైజింగ్, కమ్యూనికేషన్ స్ట్రాటజీలు, బ్రాండ్ పొజిషనింగ్ వంటి అంశాలపై ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆమె మార్గదర్శకత్వం బిస్లరీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. బిస్లరీ బ్రాండ్‌తో అనేక కొత్త ఉత్పత్తులు మార్కెట్లో కాలు పెట్టాయి. వేదికా నేచురల్ మినరల్ వాటర్, ఫిజ్జీ ప్రూట్ డ్రింక్స్, హ్యాండ్ ప్యూరిఫయ్యర్, వంటి అనేక ఉత్పత్తులు వినియోగదారుల మన్నలు పొందాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జయంతి తన ఫిలాసఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఇతర సంస్థలతో పోటీపై పెద్దగా దృష్టిపెట్టను. మాతో మాకే పోటీ’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇలా తనదైన శైలిలో జయంతి వ్యాపారాన్ని అగ్రపథాన నడిపిస్తున్నారు.

Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు

Read Latest and Viral News

Updated Date - Nov 19 , 2024 | 07:23 PM