Share News

Jeff Bezos Wedding: నా పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చా.. పచ్చి అబద్ధం: జెఫ్ బెజోస్

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:14 AM

తన పెళ్లికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను అమెజాన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ ఖండించారు.

Jeff Bezos Wedding: నా పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చా.. పచ్చి అబద్ధం: జెఫ్ బెజోస్

ఇంటర్నెట్ డెస్క్: తన పెళ్లికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను అమెజాన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తన పెళ్లి ఖర్చుపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని తేల్చి చెప్పారు (Amazon).

కొలరాడోలోని ఆస్పెన్‌లో డిసెంబర్ 28న జెఫ్ బెజోస్, తన ఫియాన్సే లారెన్ శాంఛెజ్‌ను పెళ్లాడబోతున్నట్టు అంతర్జాతీయ మీడియా తాజాగా కోడై కూసింది. ఈ అపరకుబేరుడు తన పెళ్లికి భారీగా ఖర్చు చేయబోతున్నాడని, మొత్తం ఖర్చు రూ.5 వేల కోట్లని వార్తలు వెల్లువెత్తాయి. దీంతో, ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది.

Viral: పెళ్లిచేసుకోనున్న మరో అపరకుబేరుడు.. రూ.5 వేల కోట్ల ఖర్చుతో వేడుక


ఈ వార్తలపై మరో బలియనీర్ ఇన్వెస్టర్ బిక్ ఆక్మెన్ ఎక్స్ వేదిగా స్పందిస్తూ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘ఈ వార్తలు నమ్మ శక్యంగా లేవు. పెళ్లికి వచ్చే అతిథులందరికీ చెరో ఇల్లూ కొనిస్తే తప్ప కేవలం పెళ్లికి ఇంత భారీగా ఖర్చు చేయడం అసాధ్యం’’ అని అన్నారు.

ఈ పోస్టు బెజోస్ మరింత వివరణ ఇచ్చారు. ‘‘అంతేకాదు.. అసలు ఈ వార్తలు అన్నీ అసత్యాలే. ఇలాంటిదేమీ జరగట్లేదు. చదివేదవన్నీ నిజం కాదని అనేందుకు ఇదో మంచి ఉదాహరణ. నిజం గడపదాటేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని నమ్మేయకూడదు. మరి ఈ వార్తలు ప్రచురించిన సంస్థలు సవరణలు ఇస్తాయో లేదో చూడాలి’’ అని పోస్టు పెట్టారు. ఈ ఉదంతంపై లారెన్ శాంఛెజ్ కూడా స్పందిస్తూ బెజోస్ పోస్టు తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఇదంతా అవాస్తవం అని తేల్చి చెప్పారు.

Viral: కోర్టునే ఆశ్చర్యపరిచిన ట్యాక్సీ డ్రైవర్! భార్యకు భరణం చెల్లించమంటే..


ఆస్పెన్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వింటర్ వండర్‌ల్యాండ్ థీమ్‌తో ఈ పెళ్లి వేడుకలు జరగనున్నట్టు అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. పెళ్లికి హాజరయ్యే మొత్తం 180 మంది ప్రముఖులకు ఆతిథ్యమిచ్చేందుకు ఈ రెస్టారెంట్‌ను డిసెంబర్ 27,28 తేదీలకు బుక్ చేసుకున్నట్టు తెలిపాయి. కాగా, బెజోస్, శాంఛెజ్ 2018 నుండి డేటింగ్ చేస్తున్నారు. 2019లో బెజోస్‌కు విడాకులు వచ్చాక వారు తమ బంధం గురించి బహిర్గతం చేశారు. గతేడాదే వారి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా వారి వివాహ ఖర్చు వార్తలు సంచలనంగా మారాయి.

King Charles: నేనింకా బతికే ఉన్నా.. భారత సంతతి వ్యక్తితో బ్రిటన్ రాజు జోక్!

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 23 , 2024 | 08:18 AM