Viral: వామ్మో.. దేశముదురు! ఇలాంటోళ్లే ఈ రోజుల్లో జాబ్ కొట్టేది.. అభ్యర్థి తెలివికి బాస్‌కు షాక్!
ABN , Publish Date - May 04 , 2024 | 06:51 PM
వింత ఆఫర్‌తో ఓ ఉద్యోగార్థి ఏకంగా వింగిఫై కంపెనీ వ్యవస్థాపకుడినే ఇంప్రెస్ చేసి జాబ్ కొట్టేశాడు. తనకు జాబ్ ఇస్తే ఎదురు డబ్బిస్తానంటూ అభ్యర్థి మేసేజ్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలంలో ఏం సాధించాలన్న కాస్తంత డిఫరెంట్‌గా ఆలోచించాలి. వినూత్నంగా ఉంటేనే లక్ష్యాన్ని చేరుకునేది. సరిగ్గా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడో ఉద్యోగార్థి (Job Applicant). తన తెలివితేటలతో ఏకంగా కంపెనీ వ్యవస్థాపకుడినే ఇంప్రెస్ చేసి జాబ్ ఆఫర్ కొట్టేశాడు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
సాధారణంగా కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు సీవీ, రెజ్యూమే లేదా ఇతర మార్గాల్లో జనాలు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ అభ్యర్థి మాత్రం కంపెనీ దృష్టి తనపై పడేందుకు కొత్త టెక్నిక్ ఫాలో అయ్యాడు. తను చేరాలనుకున్న వింగిఫై (WingiFy) కంపెనీ వ్యవస్థాపకుడు పరాస్ చోప్రాకు నేరుగా మెసేజ్ పెట్టాడు.
Viral: బోరున విలపిస్తూ కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ గడపతొక్కిన వ్యక్తి.. ఏం జరిగిందని ఆరా తీస్తే..
‘‘నాకు మీ కంపెనీలో పని చేయాలని ఉంది. కాబట్టి, నేనే మీకో ఆఫర్ ఇస్తా. నన్ను జాబ్‌లో పెట్టుకుంటే మీకు 500 డాలర్లు ( రూ.41 వేలు ఇస్తా) ఇస్తా. జాబ్‌లో చేరాక నా సామర్థ్యం రుజువు చేసుకోకపోతే ఆ 500 డాలర్లను మీరే తీసుకోవచ్చు. తద్వారా మీ టైం వేస్టు కాదు, నా టాలెంట్ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నాపై కూడా ఉంటుంది. నా ఆఫర్ మీరు తిరస్కరిస్తారనే ఆశిస్తున్నా’’ అని తెలివిగా మెసేజ్ పెట్టాడు (Job Applicants Unique Offer To Wingify Founder Is Viral).
ఉద్యోగం కోసం కొత్త స్టైల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థిని చూసి పరాస్ చోప్రో ఆశ్చర్యపోయారు. ఆ మెసేజీని నెట్టింట పంచుకున్నారు. జనాల దృష్టి మనపై పడాలంటే ఇలాంటిది ఏదోకటి చేయాలని ఆయన చెప్పారు. అయితే, అతడి డబ్బు తీసుకునే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేశారు.
ఈ ఉదంతం చదివి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అభ్యర్థి తెలివితేటలకు జై కొడుతున్నారు. ఇలాంటి వాళ్లే ప్రస్తుత జమానాలో నెగ్గుకొస్తారని అనేక మంది కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.