Discrimination: డేటా అనలిస్టు జాబ్.. దక్షిణాది అభ్యర్థులు అప్లై చేయొద్దంటూ సంచలన ప్రకటన
ABN , Publish Date - Dec 17 , 2024 | 09:19 PM
తమ సంస్థలో ఉద్యోగానికి దక్షిణాది రాష్ట్రాల వారు దరఖాస్తు చేయొద్దంటూ నోయిడాలోని ఓ కన్సల్టింగ్ సంస్థ ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ సంస్థలో ఉద్యోగానికి దక్షిణాది రాష్ట్రాల వారు దరఖాస్తు చేయొద్దంటూ నోయిడాలోని ఓ కన్సల్టింగ్ సంస్థ ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది. దీనిపై నెట్టింట పెద్ద రాద్ధాంతం జరుగుతోంది (Viral).
Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!
నోయిడాలో డాటా అనలిస్టు ఉద్యోగం కోసం ఈ ప్రకటన జారీ చేశారు. ఉద్యోగాహర్హతలు కూడా వివరించారు. అభ్యర్థులు వివిధ పనులు చేసే బృందాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తులతో నిత్యం సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. హై క్వాలిటీ డాటా సొల్యూషన్స్ అందించాల్సి ఉంటుంది. ఎస్‌క్యూఎల్‌లో నైపుణ్యం, ఈటీఎల్ టూల్స్ వినియోగించిన అనుభవం ఉండాలి. హిందీలో మాట్లాడటం రాయడం వచ్చి ఉండాలి. పవర్ బీఐ, ఎజైల్ మెథడాలజీస్ నైపుణ్యాల్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు. కసీనం నాలుగేళ్ల అనుభవం ఉండాలి అంటూ అర్హతలన్నీ సవివరంగా కంపెనీ రాసుకొచ్చింది. అయితే, చివర్లో సూచనగా దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..
ఈ ప్రకటన నెట్టింట కాలుపెట్టగానే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యోగుల ఎంపికలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడమేనని అనేక మంది మండిపడ్డారు. కొందరు దక్షిణాది అభ్యర్థులకు హిందీ రాకపోవడంతో పాటు రాదనే అపోహతో వారిని పక్కన పెట్టేస్తున్నట్టు ఓ వ్యక్తి చెప్పారు. కొందరు మాత్రం ఈ ప్రకటనకు మద్దతుగా నిలిచారు. ‘‘ ఆ ఉద్యోగానికి హిందీ రాయడం, చదవడం వచ్చిన వారు కావాలి. కాబట్టి దక్షిణాది వారిని స్వీకరించట్లేదు. అయితే, చివర్లో దక్షిణాది వారు వద్దంటూ అలా స్పష్టంగా పేర్కొనడం సబబు కాదని అనిపించింది’’ అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు.
Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..
అయితే, కేరళకు చెందిన అనేక మందికి హిందీపై పట్టు ఉంటుందని కొందరు గుర్తు చేశారు. వారిలో కొందరు హిందీలో మాట్లాడగలరని కూడా తెలిపారు. ఇలాంటి వారిపై ప్రకటన వివక్ష చూపుతున్నట్టే అని అన్నారు. భారతీయులు అనేక మంది రాష్ట్రాలు, దేశాలు దాటి వెళుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు సబబేనా అని కొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.
Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!