Share News

Jupiter: నేటి రాత్రి అంతరిక్షంలో అద్భుతం! అస్సలు మిస్ కావొద్దు!

ABN , Publish Date - Dec 07 , 2024 | 02:24 PM

మీకు ఖగోళ శాస్త్రమంటే ఇష్టమా? రాత్రిళ్లు చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలను వీక్షించడం ఇష్టమా? అయితే మీకో గుడ్ న్యూస్. నేటి రాత్రి ఖగోళంలో ఓ అద్భుత దృశ్యం సాక్షాత్కారం కానుంది.

Jupiter: నేటి రాత్రి అంతరిక్షంలో అద్భుతం! అస్సలు మిస్ కావొద్దు!

ఇంటర్నెట్ డెస్క్: మీకు ఖగోళ శాస్త్రమంటే ఇష్టమా? రాత్రిళ్లు చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలను వీక్షించడం ఇష్టమా? అయితే మీకో గుడ్ న్యూస్. నేటి రాత్రి ఖగోళంలో ఓ అద్భుత దృశ్యం సాక్షాత్కారం కానుంది. నేటి రాత్రి గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. మామూలుకంటే రెండింతలు పెద్దదిగా, పావు శాతం ఎక్కువ కాంతితో కనిపించనుంది (Viral).

Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే!

దాదాపు 13 నెలల తరువాత గురుగ్రహం నేటి రాత్రి భూమికి అత్యంత సమీపానికి రానుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. శాస్త్ర పరిభాషలో దీన్ని జూపిటర్ అపోజిషన్ అని అంటారు. అంటే.. భూమి, గురుగ్రహం, సూర్యుడు ఒకే వరుసలోకి వస్తాయి. భూమి ఈ రెండిటి మధ్య ఉండటంతో గురుగ్రహాన్ని రాత్రంతా చూడొచ్చు. ఈ సమయంలో భూమికి గురుగ్రహం సుమారు 367 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!

జూపిటర్ అపోజిషన్ ప్రతి ఏటా కనిపించే దృశ్యమే అయినప్పటికీ ఈమారు కొన్ని ప్రత్యేకతలు జత కూడాయట. ఫలితంగా ఈసారి గురుగ్రహం మరింత పెద్దదిగా, కాంతివంతంగా కనిపిస్తుందట. గురుగ్రహం నుంచి ప్రతిఫలించే కాంతి భూమ్మీద చేరేందుకు కేవలం 34 నిమిషాలే పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. అంతరిక్షంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారం అవుతుందని అన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని మిగులుస్తుందని చెప్పారు. గురుగ్రహంతో పాటు దాని ఉపగ్రహాలైన యూరోపా, గేనిమేడ్, కాలిస్టో, ఐయోను కూడా వీక్షించే వీలుచిక్కుతుందట.

Washing White Clothes: ఈ టెక్నిక్స్‌తో తెల్ల దుస్తులపై పాత మరకలు మాయం!


మరి ఈసారి మిస్ అయితే ఎలా అని అనుకుంటున్నారా? ఆ చింత అస్సలు అక్కర్లేదు. 2026 నుంచి 2028 మధ్య మరో మూడు సార్లు గురుగ్రహం ఇంతే కాంతివంతంగా దర్శనమిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ భూమి, గురుగ్రహం వేర్వేరు వేగం, మార్గాల్లో పరిభ్రమిస్తున్న నేపథ్యంలో ఏడాదికోసారి వివిధ సమయాల్లో ఇవి ఇలా ఒకే వరుసలో ఉన్నట్టు కనిపిస్తాయని వివరించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. నేడు సాక్షాత్కారం కానున్న ఈ అద్భుత దృశ్యం చూసేందుకు రెడీ అయిపోండి!

Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!

Read Latest and Viral News

Updated Date - Dec 07 , 2024 | 02:29 PM