Viral Video: 10 వేల మంది యువతులు ఒకే చోట డాన్స్.. ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Aug 11 , 2024 | 09:15 AM
ఒకే చోట 10,000 మంది యువతులు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది. ఆ దృశ్యం మాములుగా ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బారాముల్లా(Baramulla district)కు చెందిన 10 వేల మంది బాలికలు 'కషూర్ రివాజ్' సాంస్కృతిక ఉత్సవంలో అతిపెద్ద కశ్మీరీ జానపద నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఒకే చోట 10,000 మంది యువతులు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది. ఆ దృశ్యం మాములుగా ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బారాముల్లా(Baramulla district)కు చెందిన 10 వేల మంది బాలికలు 'కషూర్ రివాజ్' సాంస్కృతిక ఉత్సవంలో అతిపెద్ద కశ్మీరీ(kashmiri) జానపద నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. యూనివర్సల్ రికార్డ్స్ ఫోరమ్ దీనిని ప్రపంచ రికార్డుగా గుర్తించింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ డాగర్ డివిజన్, బారాముల్లా జిల్లా పరిపాలన, ఇంద్రాణి బాలన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. షౌకత్ అలీ ఇండోర్ స్టేడియంలో సంప్రదాయ నృత్యం, సంగీతం, కాలిగ్రఫీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కశ్మీర్ ప్రజలతో
ఆ క్రమంలో రౌఫ్ నృత్యం(Folk Dance) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక నెల పాటు తాము ప్రాక్టీస్ చేస్తున్నామని ఒక పార్టిసిపెంట్ తెలిపారు. జిల్లా యంత్రాంగం డీసీ మింగా షెర్పా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ సాంస్కృతిక శాఖ, పోలీసు, స్వచ్ఛంద సంస్థల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాగర్ డివిజన్ GOC మేజర్ జనరల్ రాజేష్ సేథీ, బారాముల్లా బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ రజత్ భట్ ఈ కార్యక్రమానికి వచ్చారు.
భారత సైన్యం కశ్మీర్ ప్రజలతో సన్నిహితంగా ఉందని, వారి వారసత్వం, సంప్రదాయాల పరిరక్షణకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుందని ఈ సందర్భంగా ఆర్మీ ప్రతినిధి అన్నారు. ఈ ప్రాంతం సాంస్కృతిక వారసత్వం పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ దేశం సరిహద్దులను కాపాడుతూ లోతట్టు ప్రాంతాల్లో శాంతిని కొనసాగిస్తుందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ప్రముఖ సంతూర్ ప్లేయర్
ఈ సందర్భంగా 13 ఏళ్ల ఇష్ఫాక్ హమీద్ భట్ రుబాబ్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇష్ఫాక్ కశ్మీరీ సంగీత సంప్రదాయాలను పరిరక్షించడంలో తన ప్రతిభ, అంకితభావానికి ప్రసిద్ధి చెందాడు. ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్స్ చైల్డ్ అవార్డ్ 2024ను హమీద్ దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంతూర్ ప్లేయర్ నసీర్ అహ్మద్ మీర్ కూడా ప్రదర్శన ఇచ్చారు. 2021లో కాశ్మీర్ యూనివర్శిటీ కాన్వొకేషన్‌లో సంతూర్ వాయించే కళకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి ఆయనకు బంగారు పతకాన్ని అందించారు. బారాముల్లాకు చెందిన కాలిగ్రఫీ నిపుణుడు షఫీ మీర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథికి అక్కడికక్కడే రూపొందించిన క్లిష్టమైన నగీషీ వ్రాతాన్ని కూడా ఆయన అందించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అది రైలు అనుకున్నారా.. లేక పార్క్ అనుకున్నారా.. బోగీపై ఈ ప్రేమికుల నిర్వాకం చూస్తే..
Viral Video: నమ్మశక్యం కాని వీడియో.. భారీ పర్వతాలపై చిరుతలు ఎలా గెంతుతున్నాయో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి