Viral News: బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను తొలగించేందుకు సిద్ధమైన వైద్యులు.. అంతలో షాక్..?
ABN , Publish Date - Oct 23 , 2024 | 07:40 PM
కెంటకీకి చెందిన 36 ఏళ్ల థామస్ టీజే హూవర్.. 2021, అక్టోబర్ 11వ తేదీన డ్రగ్స్ ఓవర్ డోన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానిక బాప్టిస్ట్ హెల్త్ రిచ్‌మండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. నాటి నుంచి అతడికి అక్కడ చికిత్స కొనసాగుతుంది. అయితే అతడి బ్రెయిన్ డెడ్ అయిందని ఇటీవల వైద్యులు ప్రకటించారు. అతడి శరీరాన్ని అవయదానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరంలోని అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆ వ్యక్తి శరీరంలో నుంచి గుండెను తొలగించేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎవరూ ఊహించని అద్బుతం చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరవడంతో.. వైద్యులతోపాటు ఆసుపత్రి సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది.
Also Read: Delhi LG: అనుమతి తీసుకోవాలని తెలియదు
కెంటకీకి చెందిన 36 ఏళ్ల థామస్ టీజే హూవర్.. 2021, అక్టోబర్ 11వ తేదీన డ్రగ్స్ ఓవర్ డోన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానిక బాప్టిస్ట్ హెల్త్ రిచ్‌మండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. నాటి నుంచి అతడికి అక్కడ చికిత్స కొనసాగుతుంది. అయితే అతడి బ్రెయిన్ డెడ్ అయిందని ఇటీవల వైద్యులు ప్రకటించారు. అతడి శరీరాన్ని అవయదానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు.
Also Read: Bihar: పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..
ఈ నేపథ్యంలో ఆక్టోబరు 17వ తేదీన థామస్ టీజే హూవర్‌ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అతడి శరీరంలో కదలికలు రావడమే కాదు.. కళ్లు సైతం తెరిచాడు.. అలాగే లేచి కూర్చున్నాడు.. అతడి కళ్ల నుంచి నీరు రావడం సైతం కనిపించిందంటూ వైద్యులు వెల్లడించారు. దీంతో అతడి బ్రెయిన్ డెడ్ కాలేదని వైద్యులు ఒక క్లారిటీకి వచ్చారు.
Also Read: Ktr: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: కేటీఆర్
Also Read: రేగు పండ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
దీంతో అతడిని.. తన సోదరి డోనా రోరెర్ వద్దకు పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సోదరుడు గత మూడేళ్లుగా కనీసం కళ్లు తెరవలేదన్నారు. ఈ సంఘటన అనంతరం తన సోదరుడు హూవర్ జ్ఞాపకశక్తి కోల్పోవడంతోపాటు నడవడం, మాట్లాడటం కూడా చేయలేదని చెప్పారు. అయితే ఈ ఘటనపై అమెరికా హెల్త్ సర్వీసెస్ దర్యాప్తు జరుపుతుంది.
మరిన్నీ ప్రత్యేక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...