Share News

Viral Video: ఇది ట్రైన్ లాంటిది, కానీ ట్రైన్ కాదు.. లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోక తప్పదు..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:42 PM

చాలా మంది వ్యక్తులు ప్రత్యేకమైన అభిరుచిని కలిగి ఉంటారు. ఇతరులకు భిన్నంగా ఆలోచిస్తారు. తమ అభిరుచులకు కళాత్మకత జోడించేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ వ్యక్తిగత జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తుంటారు. ప్రస్తుతం కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇల్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఇది ట్రైన్ లాంటిది, కానీ ట్రైన్ కాదు.. లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోక తప్పదు..!
A compound wall of a house at Kozhikode District

చాలా మంది వ్యక్తులు ప్రత్యేకమైన అభిరుచిని కలిగి ఉంటారు. ఇతరులకు భిన్నంగా ఆలోచిస్తారు. తమ అభిరుచులకు కళాత్మకత జోడించేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ వ్యక్తిగత జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తుంటారు. ప్రస్తుతం కేరళ (Kerala)లోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇల్లు (House) సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైన్ (Train) అంటే ఎంతో ఇష్టపడే ఆ వ్యక్తి ఆ థీమ్‌ను అచ్చంగా దింపేశాడు (Viral Video).


@Ananth_IRAS అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్రహారీ గోడ (Compound Wall) అచ్చం రైలు తరహాలో ఉంది. దూరం నుంచి చూస్తే రైలు ఆగినట్టే కనబడుతోంది. ఇంజిన్‌తో సహా పూర్తిగా రైలులా కనిపించేలా ఆ వ్యక్తి తన ఇంటి ప్రహారీ గోడను నిర్మించుకున్నాడు. దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రహారీ గోడ రూపకల్పనను చూసి ఉండరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 3.2 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఆ ఇంట్లో రైల్వే ఉద్యోగి కుటుంబం నివసిస్తోందేమో``, ``అద్భుతంగా ఉంది``, ``అద్భుతమైన క్రియేటివిటీ``, ``ఆ ఇంటి లోపలికి వెళ్లడానికి టికెట్ తీసుకోవాలేమో``, ``ఈ రైలు ఎప్పటికీ పట్టాలు తప్పదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇంత ధైర్యం ఏంటి స్వామి? పాము నోటిలో నోరు పెడితే.. తర్వాతేం జరిగిందో చూడండి..!


Viral Video: రూ.వెయ్యి ఇచ్చి మరీ భార్య చేత పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..!


Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2024 | 02:42 PM