Viral: నేటి తరం చిన్నారులు ఎలా ఉన్నారో తెలుసా? వీడియో చూస్తే షాక్ పక్కా!
ABN , Publish Date - Sep 10 , 2024 | 09:29 PM
నేటి తరం పిల్లలు సాంకేతికంగా ఎంత ముందున్నారో చెప్పే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘చిన్న పిల్లలు కూడా కోడింగ్ నేర్చుకోవాలి. దీని వల్ల ఎలా ఆలోచించాలో నేర్చుకోవచ్చు’’.. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ఒకప్పుడు అన్న మాటలివి. కానీ, నేడు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు అనేక మంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టుసాధిస్తున్నారు. ఈ ట్రెండ్‌కు భారత్ కూడా అతీతం కాదనేలా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఏఐ జమానాలో చిన్నతనం రూపురేఖలే మారిపోతున్నాయని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ వీడియోపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది (Viral).
Viral: ఆత్మహత్యాయత్నం.. రైలు రావడం ఆలస్యమయ్యేసరికి పట్టాలపైనే కునుకు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ముగ్గురు పిల్లలు ఓ అప్లికేషన్ కోడ్ గురించి వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. వృత్తినిపుణుల రేంజ్‌లో వారి సంవాదం సాగింది. ఒకరేమో ఆ ప్రోగ్రామ్ చాలా ప్రాథమిక స్థాయిలో ఉందని కామెంట్ చేస్తే మరొకరేమో ప్రోగ్రామ్ యూఐ, బటన్స్, రంగులు నచ్చాయని కామెంట్ చేశాడు. ఈ ప్రోగ్రామ్‌కు మరిన్ని ఫీచర్స్ జతచేయొచ్చని మరో కుర్రాడు కామెంట్ చేశాడు. నిపుణులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల వీడియో కాన్ఫరెన్స్‌ను తలపించిన ఈ బాలుర సంవాదం నెట్టింట పెద్ద సంచలనమే రేకెత్తించింది.
ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. జనాలు వేల కొద్దీ కామెంట్స్ లైకులతో స్పందిస్తున్నారు. ‘‘ఆటలు ఆడటం, కార్టూన్లతో గడపాల్సిన ఈ తరం చిన్నారులు ఏకంగా కోడింగ్ గురించి మాట్లాడేస్తున్నారు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘ఈ వయసులో చిన్నారులకు కోడింగ్ పరిచయం చేయడం మంచిది కాదు. గణితం, కళలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆటలపై ఈ వయసులోని వారు దృష్టి పెట్టాలి’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘కోడింగ్‌కు సంబంధించి నాకు చిక్కు సమస్య ఎదురైంది. అయితే, 14 ఏళ్ల బాలుడు చేసిన ఓ యూట్యూబ్ వీడియోలో దీని పరిష్కారం లభించింది’’ అని మరో వ్యక్తి నేటి చిన్నారుల రేంజ్ కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఈ తరం పిల్లల రేంజ్ చూస్తే షాక్ కొట్టడం పక్కా అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.