Share News

Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!

ABN , Publish Date - Aug 19 , 2024 | 02:11 PM

కిచెన్ కౌంటర్ శుభ్రం చేయడం నుండి ఆహార పదార్థాలు ఒలికిపోయినప్పుడు వాటిని తుడవడం, వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోవడం, ఇలా చాలా రకాలుగా ఉపయోగించే కిచెన్ టవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నూనె, మురికితో ఇవి జిగటగా మారతాయి.

Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!
kitchen tips

స్నానం చేసిన తరువాత శరీరం తుడుచుకునే టవల్ ను సరిగ్గా ఆరేయకపోయినా, వాటిని కనీసం నాలుగైదు రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి ఉతకకపోయినా దుర్వాసన వస్తుంటాయి. అలాంటిది వంటింట్లో కిచెన్ కౌంటర్ శుభ్రం చేయడం నుండి ఆహార పదార్థాలు ఒలికిపోయినప్పుడు వాటిని తుడవడం, వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోవడం, ఇలా చాలా రకాలుగా ఉపయోగించే కిచెన్ టవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నూనె, మురికితో ఇవి జిగటగా మారతాయి. ఈ వర్షాకాలంలో కిచెన్ టవల్స్ జిగటగా మారడంతో పాటూ తొందరగా దుర్వాసన వస్తాయి. దీన్ని నివారించాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి..

Super Blue Moon: ఈ రోజు కనిపించనున్న సూపర్ బ్లూ మూన్... ఇది నిజంగా నీలం రంగులో ఉంటుందా..?



నిమ్మరసం, ఉప్పు..

మురికి, నూనె, దుర్వాసనతో కూడిన కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలపాలి. ఇందులో కిచెన్ టవల్స్ వేసి 30 నిమిషాలు నాననివ్వాలి. ఆ తరువాత వాటిని సాధారణంగా వాష్ చెయ్యాలి. కిచెన్ టవల్స్ ను ఎట్టి పరిస్థితిలోనూ తడిగా ఉన్నప్పుడే ఉపయోగించకూడదు. పూర్తీగా ఆరిపోయి, పొడిగా ఉన్న తరువాతే ఉపయోగించుకోవాలి.

టీ ట్రీ ఆయిల్..

దుర్వాసన వచ్చే కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి టీ ట్రీ ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి, అందులో మురికి టవల్స్ ను నానబెట్టాలి. ఆపై వాటిని సాధారణం నీటితో వాష్ చేసి ఆరేయాలి. టీట్రీ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గూణాలు కలిగి ఉంటుంది. ఈ ఆయిల్ ను కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడానికి ఉపయోగించడం వల్ల కిచెన్ టవల్స్ శుభ్రం కావడమే కాకుండా వాటిలో బ్యాక్టీరియా కూడా పోతుంది.

Phool Makhana: ఫూల్ మఖానా తింటే బరువు తగ్గుతారా? ఆహార నిపుణులు ఏం చెప్పారంటే..!



జాగ్రత్తలు..

కిచెన్ టవల్స్ ను ఉతికిన తరువాత బాగా పిండాలి. నీరు మొత్తం పోయేలా పిండేసిన తరువాత ఎండలో ఆరేయాలి. వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉన్న ఆరుబయట ప్రాంతంలో ఆరేస్తే వాసన పోతాయి. తడిగా ఉన్న టపల్స్ ను ఎప్పుడూ వాడకూడదు.

డిటర్జెంట్..

చాలామంది కిచెన్ టవల్స్ వాసన పోవడానికి సువాసన గల డిటర్జెంట్ పౌడర్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ తో వాష్ చేస్తుంటారు. అయితే వీటిని ఉతికిన తరువాత బాగా ఆరబెట్టకపోతే కిచెన్ టవల్స్ దుర్వాసన వస్తాయి.

టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 19 , 2024 | 02:11 PM