Share News

Kitchen Tips: పుదీనా, కొత్తిమీర తొందరగా వాడిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో నిల్వ చేసి చూడండి..!

ABN , Publish Date - May 07 , 2024 | 04:29 PM

కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైనవి ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో చట్నీలు, జ్యూసులు ఎక్కువగా తయారుచేస్తుంటారు. సాధారణ కాలంలో కంటే వేసవికాలంలో వీటి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ డబ్బులు పోసి కొని ఇంటికి తీసుకొస్తే మహా అయితే రెండుమూడు రోజులకే కుళ్లిపోతాయి. కానీ ఇలా చేసి చూస్తే..

Kitchen Tips: పుదీనా, కొత్తిమీర తొందరగా వాడిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో నిల్వ చేసి చూడండి..!

కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైనవి ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో చట్నీలు, జ్యూసులు ఎక్కువగా తయారుచేస్తుంటారు. సాధారణ కాలంలో కంటే వేసవికాలంలో వీటి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ డబ్బులు పోసి కొని ఇంటికి తీసుకొస్తే మహా అయితే రెండుమూడు రోజులకే కుళ్లిపోతాయి. ఎంత జాగ్రత్త చేసినా వారానికి మించి నిల్వ ఉండవు. కానీ కింది టిప్స్ పాటిస్తే ఈ ఆకులను చాలారోజులు తాజాగా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

కొత్తిమీర, పుదీనా ఆకులను ఇంటికి తెచ్చినప్పుడల్లా వాటిని సరిగ్గా నిల్వ చేయడం ముఖ్యం. ఈ ఆకులను నిల్వ చేయడానికి, తాజా ఆకుల మూలాలను కత్తిరించి వాటిని వేరు చేయాలి. ఒక కంటైనర్ తీసుకుని అందులో నీళ్ళు, ఒక చెంచా పసుపు వేసి కలపాలి. కొత్తిమీర, పుదీనా ఆకులను ఈ నీటిలో అరగంట నానబెట్టి, ఆపై వాటిని బాగా కడిగి, వాటిని పేపర్ టవల్‌పై పరచి ఆరబెట్టాలి.. దీని తరువాత కంటైనర్‌లో ఒక పేపర్ టవల్‌ను పరచి దానిపై ఈ ఆకులను పరచి, దాని పైన మరొక టవల్‌ను పరచి మళ్లీ ఆకులను ఉంచాలి. ఇలా కొత్తిమీర, పుదీనా ఆకులను విడివిడిగా ఉంచినట్లయితే అవి 2 నుండి 3 వారాల వరకు తాజాగా ఉంటాయి.

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!


కొత్తిమీర, పుదీనా నిల్వచేయడానికి మరొక పద్దతి ఉంది. దీనికోసం ఒక గాజు గ్లాసు అవసరం. ఒక గ్లాసు తీసుకొని నీళ్లతో నింపాలి. కొత్తిమీర, పుదీనా ఆకులను తీసుకుని వాటి మూలాలను కత్తిరించి ఆకుల కాండంను గ్లాసులో ముంచాలి. ఈ గ్లాస్‌ని అలాగే రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఆకులను తెరిచి ఉంచడానికి బదులుగా జిప్ లాక్ బ్యాగ్ వంటి ప్లాస్టిక్ బ్యాగ్‌తో వాటిని కవర్ చేయండి. పుదీనా, కొత్తిమీర ఇలా నిల్వ ఉంచుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

కొత్తిమీర, పుదీనా ఆకులను తాజాగా ఉంచడానికి, చాలా మంది వాటిని మస్లిన్ క్లాత్ లేదా బ్రౌన్ పేపర్‌లో చుట్టి ఉంచుతారు. ఇది ఆకుల తాజాదనాన్ని కాపాడుతుంది.

కొత్తిమీర లేదా పుదీనా ఆకులను కొనుగోలు చేయగానే మొదటగా ఆకులను శుభ్రం చేయాలి. చెడు ఆకులను తొలగించి వాటిని వేరు చేయాలి. ఈ శుభ్రమైన ఆకులను గాలి చొరబడని కంటైనర్‌లో మూసివేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 07 , 2024 | 04:29 PM