Share News

Viral: లగ్జరీ కారులో అకస్మాత్తుగా మంటలు! ‘రేమండ్స్’ అధినేత గుస్సా!

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:23 PM

ముంబైలో ప్రముఖ స్పోర్ట్స్ కారు లాంబోర్గినీ హురకాన్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ వీడియోను షేర్ చేసి రేమండ్స్ సంస్థ అధినేత కారులోని భద్రతా ప్రమాణాలపై సందేహం వ్యక్తం చేశారు.

Viral: లగ్జరీ కారులో అకస్మాత్తుగా మంటలు! ‘రేమండ్స్’ అధినేత గుస్సా!

ఇంటర్నెట్ డెస్క్: లగ్జరీ కార్లంటే ముందుగా గుర్తొచ్చేవి వాటి వేగం. ఆకర్షణీయమైన డిజైన్లే! అయితే, వీటిలో భద్రతా ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ కార్లల్లో భద్రతా ఏర్పాట్లు ఏమాత్రం తక్కువైనా పెను ప్రమాదాలు జరుగుతాయి. కానీ, ప్రముఖ స్పోర్ట్స్ కారు లాంబోర్గినీ హురకాన్‌లో నడిరోడ్డుపై అకస్మాత్తుగా మంటలు రేగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన రేమండ్స్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు (Mumbai).

ముంబైలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోస్టల్ రోడ్‌పై కారు వెళుతుండగా పొగలు, మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు 45 నిమిషాలు పట్టిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది ఒకరు తెలిపారు.

Viral: షాకింగ్.. అమెరికా విమానంలో మృతదేహం..


అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ఎవరిదో, ఘటన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

మంటల్లో చిక్కుకున్న ఈ కారు వీడియోను రేమండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కారులో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై సందేహాలు కలిగిస్తాయి. ఇంత పేరుప్రఖ్యాతులు, ఖరీదు ఉన్న కారులో భద్రతా ప్రమాణాల్లో చిన్న లోపం కూడా ఉండకూడదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Viral: ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేరు చార్జీల ఆరోపణ.. స్పందించిన ఉబర్


దూకుడైన డిజైన్, శక్తిమంతమైన ఇంజెన్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవానికి ప్రఖ్యాతి గాంచిన లాంబోర్గినీ హురకాన్ 2014లో మార్కెట్లో ఆరంగేట్రం చేసింది. ప్రస్తుతం దీని ఖరీదు రూ.3.22 కోట్ల నుంచి రూ.4.2 కోట్లు వరకూ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 202 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 5.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ వీ10 ఇంజెన్, 7 స్పీడు డ్యుయెల్ క్లచ్ ఆటోమేటిక్, ఆల్ వీల్ డ్రైవ్, వంటి ఫీచర్లున్న ఈ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేవలం 2.9 సెకెన్లలోనే గంటకు 60 మైళ్ల వేగాన్ని అందుకోగల ఈ కారు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Read Latest and Viral News

Updated Date - Dec 26 , 2024 | 12:32 PM