Share News

Viral Video: ఏ ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు.. వీడియో చూస్తే కంటతడి పెట్టాల్సిందే..!

ABN , Publish Date - Mar 07 , 2024 | 06:58 PM

Viral Video: జీవితం ప్రతి ఒక్కరికి పూలపాన్పు ఏమీ కాదు.. ఒక్కొక్కరి జీవితం ఒక్కోరకంగా ఉంటుంది. కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకలతో సాగిపోతుంది. భారతదేశం వేగంగా అభివృద్ధి(India Development) చెందుతోంది అని ప్రభుత్వాలు(Governments) ఎంత ఊదరగొట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు తిండి దొరకని స్థితిలో ఉన్నారు. ఒక్క పూట గడిస్తే చాలు దేవుడా అని ప్రార్థించేవారు కోకొల్లలుగా ఉన్నారు.

Viral Video: ఏ ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు.. వీడియో చూస్తే కంటతడి పెట్టాల్సిందే..!
Little Boy Video Viral

Viral Video: జీవితం ప్రతి ఒక్కరికి పూలపాన్పు ఏమీ కాదు.. ఒక్కొక్కరి జీవితం ఒక్కోరకంగా ఉంటుంది. కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకలతో సాగిపోతుంది. భారతదేశం వేగంగా అభివృద్ధి(India Development) చెందుతోంది అని ప్రభుత్వాలు(Governments) ఎంత ఊదరగొట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు తిండి దొరకని స్థితిలో ఉన్నారు. ఒక్క పూట గడిస్తే చాలు దేవుడా అని ప్రార్థించేవారు కోకొల్లలుగా ఉన్నారు. కొందరు తిండికోసం పోరాడుతుంటే.. మరికొందరు జీవితం కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్(Viral Video) అవుతోంది. ఆ వీడియో చూస్తే మనిషన్నోడు ఎవరికైనా కన్నీరు రాక మానదు. ఈ వీడియో ఓ అబ్బాయి ఆకలితో అలమటిస్తూ అన్నంలో నీళ్లు, ఉప్పు వేసుకుని కలిపి తినేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో ఓ అబ్బాయి స్కూల్‌ బ్యాగ్ అయినా కిందకు దించుకుండానే నేరుగా వంటగదిలోకి వచ్చాడు. మట్టి ఇంటి లోపన చిన్న వంట గది ఉండగా.. అక్కడే అన్నం వండిన గిన్నె ఉంది. నేరుగా ఓ ప్లేట్ తీసుకుని, అందులో అన్నం పెట్టుకున్నాడు. కొంత అన్నం కింద పడిపోతే దానిని కూడా తుడిచి మళ్లీ తన ప్లేట్‌లో వేసుకున్నాడు. అన్నంలో కలపడానికి కూర లేకపోవడంతో మంచినీటినే కూరగా మార్చుకున్నాడు చిన్నారి. అన్నంలో కాసింత ఉప్పు వేసి, నీళ్లు పోసుకుని కలిపాడు. ఆ అన్నాన్ని తినేశాడు. దీనిని వీడియో తీసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇదికాస్తా వైలర్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకున్నారు. ఉన్నోళ్లేమో విలాసాలకు తెగబడుతుంటే.. లేనోళ్లు పిడికెడు అన్నం ముద్ద కోసం ఆరాటపడుతున్నారు.

ఈ సమాజంలోని అసమానతలు మారేదెప్పుడు? ప్రతి ఒక్కరు కడుపునిండా అన్నం తినేదెప్పుడు? అందుకే ఏ ఒక్కరి జీవితం ఒకేలా ఉండదని అంటుంటారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ లైఫ్‌లో తాము ఎదుర్కొన్న పరిస్థితులు, తాము చేసిన పరిస్థితులను పేర్కొంటూ కామెంట్స్ పెడుతున్నారు. పేదలను గౌరవించాలని, పేదరికం తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 06:58 PM