Viral: ఉత్త చేతులతో చిరుతను బంధించిన గ్రామస్థులు.. షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:18 PM
తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతను ఉత్త చేతులతో పట్టుకున్న గ్రామస్థుల ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో మహరాజ్ గంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతను ఉత్త చేతులతో పట్టిబంధించిన గ్రామస్థుల ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఉత్తరప్రదేశ్‌లో మహరాజ్‌గంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, లాల్‌పూర్ గ్రామస్థులు ఈ చిరుతను ఉత్త చేతులతో లొంగదీసుకుని బంధించారు. ఒకరు దాని మెడ చుట్టూ చేయి వేసి కదలకుండా పట్టుకోగా మరికొందరు దాని నడుము భాగాన్ని పట్టుకున్నాడు. ఇంకొందరు దాని కాళ్లను గట్టిగా పట్టుకుని కదలకుండా చేశారు.
Viral: జోరున వాన.. కంగారులో 2.6 రేటింగున్న క్యాబ్ బుక్ చేస్తే..
నెట్టింట కథనాల ప్రకారం, చిరుత సంచారం గురించి గ్రామస్థులు అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారట. ఏదోక రోజు చిరుత దాడికి బలవుతామన్న భయంతో వారు స్వయంగా దాన్ని పట్టుకునేందుకు ధైర్యం చేశారు. అత్యంత ప్రమాదకరంగా వారు దాన్ని ఉత్త చేతులతోనే పట్టుకుని బంధించారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
‘‘చిరుత సంచారంతో జనాలు బెదిరిపోయారు. అటవీ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు వారే స్వయంగా రంగంలోకి దిగారు. చాలా శ్రమపడి దాన్ని అదుపులోకి తీసుకున్నారు’’ అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు.
Viral: చేతి కుస్తీ పోటీలు! పుల్లలా విరిగిన చేయి! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
కాగా, వీడియోపై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జంతువును అంతలా హింసించడంపై అనేక మంది మండిపడ్డారు. నమ్మశక్యంగా లేదు అని కొందరు కామెంట్ చేశారు. ‘‘వారు దాని గొంతును గట్టిగా పట్టుకున్నారు. దానికి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంది’’ అని మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిజంగా దారుణం అని అనేక మంది వాపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
జనాభా పెరిగే కొద్దీ మనుషుల ఆవాసాలు విస్తరిస్తున్నాయి. అటవీ ప్రాంతం తగ్గిపోతోంది. దీంతో అడవి జంతువులు ఆహారం కోసం తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. జనాల దాడితో అవి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఆచరణాత్మక పరిష్కారాలు కొనుగొనాలంటూ ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
Viral: దొంగలున్నారో లేదో తెలుసుకునేందుకు యువతి ప్రయోగం.. షాకింగ్ వీడియో!
Viral: బిస్కెట్లల్లో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా?
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! చెడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్