Math Magic Trick: మ్యాజిక్ మ్యాథ్స్.. ఈ చిన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు.. మీ వల్ల అవుతుందా?
ABN , Publish Date - Mar 09 , 2024 | 04:30 PM
Viral News: ప్రస్తుత సమాజంలో రాణించాలంటే.. బుర్రకు(Brain) పని చెప్పాల్సిందే. లేదంటే ఎక్కడో ఓ మూలకు మందలో ఒకడిగా ఉండిపోతారు. ఆలోచనా శక్తి విస్తృతంగా(Knowledge) ఉండాలి. పరిస్థితులను అవగతం చేసుకుంటూ.. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి. అప్పుడే జీవితంలో సక్సెస్(Success in Life) అవుతారు. జీవితంలోనే కాదు..
Viral News: ప్రస్తుత సమాజంలో రాణించాలంటే.. బుర్రకు(Brain) పని చెప్పాల్సిందే. లేదంటే ఎక్కడో ఓ మూలకు మందలో ఒకడిగా ఉండిపోతారు. ఆలోచనా శక్తి విస్తృతంగా(Knowledge) ఉండాలి. పరిస్థితులను అవగతం చేసుకుంటూ.. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి. అప్పుడే జీవితంలో సక్సెస్(Success in Life) అవుతారు. జీవితంలోనే కాదు.. ఏ విషయంలో సక్సెస్ కావాలన్నా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సిందే. అలా మన మెదడుకు పని చెప్పే ఇంట్రస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ సోషల్ మీడియాలో నిత్యం అనేకం వైరల్ అవుతున్నాయి. వాటిని సాల్వ్ చేయడం ద్వారా మన మెదడుకు పని చెప్పొచ్చు. మన ఆలోచనా పరిధి కూడా విస్తృతం అవుతుంది. తాజాగా అలాంటి మ్యాజిక్ మ్యాథ్స్ క్వశ్చన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న పిల్లలు సైతం ఈజీగా చెప్పేలా ఉన్న ఈ ప్రశ్నకు కొందరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. మరి మీరైనా ఆన్సర్ చెప్పగలరా? లేదా? ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటో ఓసారి చూద్దాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లాజిక్ ప్రశ్న ఇదీ..
‘మూడు పిల్లులు మూడు ఎలుకలను మూడు నిమిషాల్లో పట్టుకుంటే.. మరి 100 పిల్లులు 100 ఎలుకలను ఎంత సమయంలో పట్టుకుంటాయి?’. ఇది చాలా సింపుల్ ప్రశ్న. సరిగ్గా ఆలోచిస్తే జస్ట్ 2 సెకెన్లలో దీనికి సమాధానం చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం ఆన్సర్ కనిపెట్టేయండి.
ఇదికూడా చదవండి: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!
సమాధానం చెప్పలేపోయారా? ఇక్కడ చూడండి..
ఇక్కడ ఒక్క పిల్లి ఒక్క ఎలుకను పట్టుకోవడానికి మూడు నిమిషాలు పడుతుంది. ఆ లెక్కన మూడు పిల్లులు మూడు ఎలుకలను పట్టుకోవడానికి మూడు నిమిషాలు పడుతుంది. అంటే 100 పిల్లులు.. 100 ఎలుకలను పట్టుకోవడానికి కూడా 3 నిమిషాలే పడుతుందన్నమాట.