Share News

UP: క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక..

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:41 PM

ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్ష విలువైన రెండు ఫోన్లు ఆర్డరిచ్చిన నిందితులు, ఇంటికొచ్చిన డెలివరీ ఏజెంట్‌ను చంపి వాటిని తస్కరించారు. లక్నోలో ఈ దారుణం వెలుగు చూసింది.

UP: క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక..

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. క్యాష్ ఆన్ డెలివరీపై రూ.లక్షన్నర విలువైన ఐఫోన్ ఆర్డరిచ్చిన నిందితులు, ఇంటికొచ్చిన డెలివరీ ఏజెంట్‌ను చంపి దాన్ని తస్కరించారు. లక్నోలో (UP) ఈ దారుణం వెలుగు చూసింది.

Viral: అచేతనంగా పుట్టిన శిశువును ఈ డాక్టర్ ఎలా బతికించారో చూస్తే..

పూర్తి వివరాల్లోకి వెళితే, భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్‌ సెప్టెంబర్ 25న దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత హిమాన్షూ కనౌజియా అనే నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ ఆర్డరిచ్చాడు. క్యాష్ ఆన్ డెలివరీపై (వస్తువు డెలివరీ అయ్యాక డబ్బు చెల్లించడం) ఫోన్‌కు ఆర్డర్‌ పెట్టిన అతడు చిన్హాట్‌ ప్రాంతంలోని తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు.

Viral: కుందేలు, తాబేలు మధ్య పరుగు పదెం.. చివరికి ఏమైందో చూస్తే..


కాగా, సాహు ఫోన్‌ డెలివరీ ఇచ్చేందుకు కనౌజీయా ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు నిందితులు గజానన్, ఆకాశ్.. భరత్‌ గొంతు నులిమి చంపి హత్య చేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకున్నాక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఇందిరా కాలవలో పడేశారు.

Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

కాగా, భరత్ ఆ రాత్రి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాహు కాల్ రికార్డ్స్ ఆధారంగా గజానన్, అతడి స్నేహితుడి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. సాహును చంపి ఐఫోన్ తీసుకెళ్లానని ముందుగా తాము పథకం పన్నిట్టు అంగీకరించాడు. అతడిని చంపిన అనంతరం మృతదేహాన్ని బస్తాలో కుక్కి సమీపంలోని కాలువలో పడేసినట్టు చెప్పారు. మరోవైపు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సాయంతో పోలీసులు సాహు మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Viral: వామ్మో! బెంగళూరులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా! నోరెళ్లబెట్టాల్సిందే!


కాగా, సాహు హత్యపై అతడి సోదరుడు తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. గత ఎనిమిదేళ్లుగా సాహు డెలివరీ ఏజెంట్‌గా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. నిందితులకు మరణ శిక్ష పడేలా చేయాలంటూ పోలీసులకు మృతుడి సోదరుడు విజ్ఞప్తి చేశారు. 2021లో కూడా బెంగళూరులో ఇలాంటి దారుణం జరిగింది. ఓ డెలివరీ ఏజెంట్‌ వద్ద ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో నిందితుడు అతడిని హత్య చేశాడు. ఆ మరుసటి ఏడాది ఢిల్లీలో కొందరు చెల్లింపు విషయంలో డెలివరీ ఏజెంట్‌తో గొడవపడి హత్య చేశారు.

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక

Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

Read Latest and Viral News

Updated Date - Oct 01 , 2024 | 12:57 PM