Share News

Viral Video: కండక్టర్ దూకుడు.. స్టూడెంట్‌పై..!!

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:34 PM

ఇండోర్‌లో ఓ బస్సులో విద్యార్థి ప్రయాణిస్తున్నాడు. అతనితో అమ్మాయి ఉంది. టికెట్ అని అడగగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తమ వద్ద పాస్ ఉన్నాయని విద్యార్థి చెప్పాడట.. ఆ కండక్టర్‌కు సరిగా వినపడలేదు అనుకుంట. అదే విషయంపై మరి మరి అడగటం.. స్పందించడం లేదని కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

Viral Video: కండక్టర్ దూకుడు.. స్టూడెంట్‌పై..!!
Conductor VS Student

చిన్న విషయానికి కొందరిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దాంతో వాగ్వివాదం, గొడవ.. చివరికి చేయి చేసుకునే వరకు వెళుతుంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లో ఓ కండక్టర్ ఇలానే ప్రవర్తించాడు. నా వద్ద పాస్ ఉంది మొర్రో అని చెబుతున్న వినిపించుకోలేదు. ఓ విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించాడు. నెట్టేశాడు. చేయి చేసుకున్నాడు. ఆ విద్యార్థి కూడా ఊరుకోలేదు.


ఏం జరిగిందంటే..?

ఇండోర్‌లో ఓ బస్సులో విద్యార్థి ప్రయాణిస్తున్నాడు. అతనితో అమ్మాయి ఉంది. టికెట్ అని అడగగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తమ వద్ద పాస్ ఉన్నాయని విద్యార్థి చెప్పాడట.. ఆ కండక్టర్‌కు సరిగా వినపడలేదు అనుకుంట. అదే విషయంపై మరి మరి అడగటం.. స్పందించడం లేదని కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ విద్యార్థిని నెట్టేశాడు. చేయి చేసుకున్నాడు. ఇంకేముంది ఆ విద్యార్థి ఆగలేదు. ఆ కండక్టర్‌పై దాడి చేశాడు. వరసగా మూడు దెబ్బలు వేశాడు. తర్వాత అక్కడున్న మిగతా ప్రయాణికులు ఆపడంతో ఇద్దరు ఆగారు. ఆ సమయంలోనే తన వద్ద పాస్ ఉందని విద్యార్థి అనే మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయి.


Viral Video: కొత్తదనం కోసం కపుల్ ఇలా..!!


విద్యార్థికి సపోర్ట్

ఆ వీడియోను ఘార్ కే కలేష్ అనే పేరుతో సోషల్ మీడియాలో ఎక్స్‌లో రెండురోజుల క్రితం పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. రెండురోజుల్లో 217కే వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కామెంట్లతో ఆ సెక్షన్ నిండిపోయింది. చాలా మంది విద్యార్థికి సపోర్ట్ చేశారు. కొందరు మాత్రం కండక్టర్‌ను వెనకేసుకొచ్చారు.


బానే బలం ఉంది.

ఆ విద్యార్థికి బాగానే బలం ఉందని ఒకరు.. విద్యార్థికి పాస్ ఉందని చెప్పిన గాని, అతనిపై చేయి చేసే ధైర్యం ఆ కండక్టర్‌కు ఎలా వచ్చిందని మరొకరు కామెంట్ చేశారు. విద్యార్థికి పాస్ ఉందని చెప్పిన దాడి చేయడం సరికాదని చాలా మంది అభిప్రాయ పడ్డారు. డ్యూటీలో ఉన్న అధికారిపై చేయి చేసుకోవడం తప్పు అని మరికొందరు కామెంట్ చేశారు.


Read Latest
Viral News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 05:47 PM