Share News

Fraud Case: భారీ మోసం.. రూ.1 కోటికి పైగా డబ్బులు స్వాహా.. అసలేమైందంటే?

ABN , Publish Date - Mar 17 , 2024 | 09:14 PM

ఈమధ్య కాలంలో సైబర్ మోసాలు (Cyber Cheating) గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో అప్రమత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, భారీ మొత్తంలో డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో.. ఉన్నదంతా కోల్పోతున్నారు.

Fraud Case: భారీ మోసం.. రూ.1 కోటికి పైగా డబ్బులు స్వాహా.. అసలేమైందంటే?

ఈమధ్య కాలంలో సైబర్ మోసాలు (Cyber Cheating) గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో అప్రమత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, భారీ మొత్తంలో డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో.. ఉన్నదంతా కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని.. రూ.1 కోటికి పైగా డబ్బు కోల్పోయాడు. షేర్ ట్రేడింగ్‌లో ఎక్కువ రాబడి తెచ్చిపెడతామని ఆశ చూపి.. అతని వద్ద నుంచి అంత మొత్తాన్ని మోసగాళ్లు కాజేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


మహారాష్ట్రలోని నవీ ముంబైకి చెందిన 48 ఏళ్ల వ్యక్తికి జనవరి నెలలో వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. షేర్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే.. అధిక రాబడి వస్తుందని ఆ మెసేజ్‌లో రాసి ఉంది. అది చూసి టెంప్ట్ అయిన ఆ వ్యక్తి.. ఆ మెసేజ్‌కి బదులిచ్చాడు. ఇంకేముంది.. తాము వేసిన గాలంలో చేప చిక్కుకుందని భావించిన సైబర్ నేరగాళ్లు, అతడ్ని తమ బుట్టలో పడేసేందుకు వ్యూహాలు మొదలుపెట్టారు. తొలుత షేర్ ట్రేడింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని బాధితుడికి అందజేశారు. అందులో పెట్టుబడి పెడితే.. తక్కువ రోజుల్లోనే భారీ లాభాలు సొంతం చేసుకోవచ్చని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు.. మోసగాళ్లు చెప్పినట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేశాడు. ఇలా ఏకంగా రూ.1.36 కోట్లను జమ చేశాడు.

అయితే.. డబ్బులు జమ చేయడం తప్పిస్తే, తనకు ఎలాంటి రాబడి రాకపోవడంతో బాధితుడు వాళ్లను ప్రశ్నించాడు. అంతే.. ఆ మోసగాళ్లు తెలివిగా తప్పించుకున్నారు. ఎలా సంప్రదించినా.. అవతలి నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులు, ఏంజెల్ వన్ అనే సంస్థపై భారతీయ శిక్షాస్మృతి, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 420 (చీటింగ్), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. జనవరి 20 నుంచి మార్చి 13 మధ్య ఈ ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 09:14 PM