Share News

Viral: భారత ఆర్మీ అంటే ఇదీ! ఈ 56 ఏళ్ల మేజర్ జనరల్ స్టామినా చూస్తే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 09:38 PM

దేశరక్షణ బాధ్యతను నిర్వర్తిస్తున్న భారత సైనికుల రేంజ్ ఏంటో కళ్లకు కట్టినట్టు చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 56 ఏళ్ల వయసులోనూ మేజర్ జనరల్ జోషీ యువ సైనికులతో సమానంగా ఫిట్‌నెస్ కలిగుడటం నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది

Viral: భారత ఆర్మీ అంటే ఇదీ! ఈ 56 ఏళ్ల మేజర్ జనరల్ స్టామినా చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: దేశరక్షణ బాధ్యతను నిర్వర్తిస్తున్న భారత సైనికుల రేంజ్ ఏంటో కళ్లకు కట్టినట్టు చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. 56 ఏళ్ల వయసులోనూ మేజర్ జనరల్ జోషీ యువ సైనికులతో సమానంగా ఫిట్‌నెస్ కలిగుడటం నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. జై జవాన్ అంటూ వేనోళ్ల కీర్తించేలా చేస్తోంది. లెఫ్టెనెంట్ కల్నల్ జేఎస్ సోధీ ఈ వీడియోను షేర్ చేశారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ జిమ్‌లోకి వెళ్లిన మేజర్ జనరల్ జోషి అక్కడ యువ సైనికులను ఆశ్చర్యపరిచేలా తన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించారు. అత్యంత సులువుగా 25 పుల్ అప్స్ చేశారు. యువ సైనికులు అంకెలు లెక్కపెడుతుంటే అలుపూసొలుపూ లేకుండా 25 పుల్ అప్స్ చేశారు. ఆయన ఫిట్‌నెస్ చూసి అక్కడి యువ సైనికులు కూడా ఆశ్చర్యపోయారు (Major General 56 performs 25 pull ups without break Internet is inspired).

Viral: పార్సిల్‌తో చిట్టీనీ వదిలి వెళ్లిన డెలివరీ ఏజెంట్! అది చదివిన మహిళ..


ఈ వీడియో షేర్ చేసిన కల్నల్ సోధీ.. జోషీపై ప్రశంసలు కురిపించారు. ఆయన శారీరక దారుఢ్యం చూస్తుంటే ఆశ్చర్యంతో పాటు గౌరవం కూడా కలుగుతోందని అన్నారు. ఇలాంటి సైనికుల కారణంగానే భారత్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన పోరాటశక్తిగా 2022లో గుర్తింపు సొంతం చేసుకుందని అన్నారు. భారత ఆర్మీ దేశానికే గర్వకారణమని అన్నారు. జై హింద్ అని నినదించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ వయసులో కూడా అంతటి ఫిట్‌నెస్ కలిగి ఉన్నారంటే భారత ఆర్మీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని కొందరు కామెంట్ చేశారు. జోషిని చూస్తుంటే తనకు జిమ్ లో చేరి ఆ స్థాయి ఫిట్‌నెస్ సాధించాలన్న స్ఫూర్తి మనసులో రగిలిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

పుల్ అప్స్ అత్యంత కష్టమైన కసరత్తని నిపుణులు చెబుతున్నారు. శరీర పైభాగం, కోర్ స్ట్రేంగ్త్ దీనికి కీలకమని అన్నారు. బరువు మొత్తాన్ని రెండు చేతులతో ఎత్తేందుకు పూర్తిస్థాయిలో శరీరం పూర్తి స్థాయిలో కదపాల్సి వస్తుందని, ఇది సవాలుతో కూడుకున్నదని చెబుతున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 09:59 PM