Share News

Viral: కొడుకుకు బైక్ కొనిచ్చిన తండ్రి! తన తప్పేమిటో తెలిసి ఏం చేశాడో చూస్తే..

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:02 PM

కన్న కొడుకు కోసం బైక్ కొనిచ్చిన ఓ వ్యక్తి చివరకు తనే స్వయంగా దాన్ని తగలబెట్టేశాడు. కొడుకు క్షేమం కోసమే ఇలా చేశానని చెప్పాడు. మలేషియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Viral: కొడుకుకు బైక్ కొనిచ్చిన తండ్రి! తన తప్పేమిటో తెలిసి ఏం చేశాడో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కన్న కొడుకు కోసం బైక్ కొనిచ్చిన ఓ వ్యక్తి చివరకు తనే స్వయంగా దాన్ని తగలబెట్టేశాడు. కొడుకు క్షేమం కోసమే ఇలా చేశానని చెప్పాడు. మలేషియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది (Viral). కౌలాలంపూర్‌లో ఉండే ఓ వ్యక్తి కొంత కాలం క్రితం తన కుమారుడికి బైక్ కొనిచ్చాడు. సుదూరాన ఉన్న కాలేజీకి రోజూ వెళ్లి వచ్చేందుకు అతడు ఇబ్బంది పడుతుండటం చూసి బాధపడ్డ ఆయన వాహనాన్ని ఇచ్చాడు.

Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!


కానీ వాహనం కొనిచ్చాక కుమారుడి తీరులో భారీ మార్పు వచ్చేసింది. బైక్ రేసింగ్‌లకు అలవాటుపడ్డ అతడు నిత్యం రేసులతోనే గడిపేసేవాడు. రాత్రిళ్లు లేటుగా ఇంటికొచ్చేవాడు. యువకుడికి నచ్చచెప్పి అతడిని సక్రమమార్గంలో పెట్టాలని ఆ తండ్రి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఉపయోగం లేకపోయింది. బైక్ రేసింగులు అతడికో వ్యసనంగా మారాయి. దీంతో, ఏ దుర్వార్త వార్త వినాల్సి వస్తుందో అంటూ ఆ తండ్రి బిక్కుబిక్కు మంటూ గడపసాగాడు. ఫోన్ వస్తే చాలు అది తన కన్నబిడ్డకు సంబంధించిన చెడు వార్త అని అనుమాన పడుతూ నిలువెల్లా వణికిపోయేవాడు. తండ్రి పరిస్థితి ఇలా ఉన్నా కూడా కొడుకు తన ధోరణిని మార్చుకోలేదు.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..


చివరకు ఆ తండ్రి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఓరోజు తన కుమారుడు ఇంట్లో లేని సమయంలో బైక్‌ను బయటకు తీసుకెళ్లి తగలబెట్టేశాడు. తన కొడుకును కాపాడుకునేందుకు ఇంతకు మించి మార్గం లేదని అతడు స్పష్టం చేశాడు. ‘‘నా కొడుకు యాక్సిడెంట్ బారినపడ్డాడని ఫోన్ వస్తుందేమో అని ప్రతి రోజూ భయపడేవాణ్ణి. లేదా అతడి వల్లే ఎవరైనా ప్రాణాల కోల్పోయారేమోనని ఆందోళచెందేవాణ్ణి. రేసింగులు మానమని ఎంత చెప్పినా నా కొడుకు వినలేదు. ఈ పరిస్థితి తట్టుకోవడం ఇక నా వల్ల కాలేదు’’ అని అతడు చెప్పాడు.


Viral: టైం వేస్ట్.. ఐఫోన్ 16 ప్రోపై టెకీ తీవ్ర అసంతృప్తి! కారణం ఏంటంటే..

ఇటీవల అమెరికాలో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ వ్యక్తి.. ప్రమాదంలో పడ్డ తన కుమారుడిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. కారు రేసు సందర్భంగా ఆ పెద్దాయన కొడుకు వాహనం అదుపుతప్పి పక్కనున్న రెయిలింగ్స్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదంతా చూసిన తండ్రి.. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కంటే ముందుగా స్పందించి కొడుకును కాపాడుకున్నాడు. కారు వద్దకు మెరుపువేగంతో వెళ్లి వాహనం నుంచి అతడిని బయటకు లాగేశాడు. ఆ మరుక్షణమే పెట్రోల్ లీక్ అవడంతో కారు పెద్ద శబ్దంలో పేలిపోయింది.

Viral: ఇదేమి మిస్టరీ బాబోయ్! లాప్‌టాప్ స్క్రీన్‌ లోపల చీమ..!

Read Latest and Viral News

Updated Date - Oct 05 , 2024 | 12:12 PM