Share News

Viral: భారీ మిస్టేక్! దీపావళి కోసం ఇల్లు శుభ్రం చేస్తుండగా..

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:04 PM

దీపావళి పండుగ కోసం ఇల్లు శుభ్రం చేస్తూ పొరపాటున లక్షల విలువైన బంగారు నగ పోగొట్టుకున్న ఓ కుటుంబం అదృష్టవశాత్తూ తిరిగిపొంద గలిగింది.

Viral: భారీ మిస్టేక్! దీపావళి కోసం ఇల్లు శుభ్రం చేస్తుండగా..

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ కోసం ఇల్లు శుభ్రం చేస్తూ పొరపాటున లక్షల విలువైన బంగారు నగ పోగొట్టుకున్న ఓ కుటుంబం అదృష్టవశాత్తూ తిరిగిపొంద గలిగింది. రాజస్థాన్‌తో తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా (Viral) మారింది.

Diwali Decoration: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు


భిల్వారా నగరానికి చెందిన చిరాగ్ శర్మ కుటుంబం పండుగ కోసమని ఇల్లు శుభ్రం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో వారు రూ.4.5 లక్షల విలువైన ఒక నగను ఓ చోట జాగ్రత్తగా దాచి మరీ ఇంటిని శుభ్రం చేయసాగారు. ఇంతలో మున్సిపాలిటీ ట్రక్ రావడంతో హడావుడిగా వారు తమ ఇంట్లోని చెత్తను ట్రక్‌లో వేశారు. ఈ క్రమంలో పొరపాటున చెత్తతో పాటు నగను కూడా ట్రక్‌లో వేశారు. ట్రక్ వెళ్లిపోయిన తరువాత వారు జరిగిన పొరపాటును గుర్తించి లబోదిబోమన్నారు. ఆపై తేరుకుని వెంటనే భిల్వారా నగర మేయర్ రాకేశ్ పాఠక్‌కు సమాచారం అందించారు.

వెంటనే అప్రమత్తమైన మేయర్.. నగను వెతికిపట్టుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని రంగంలోకి దింపారు. వారు చెత్త పోగంతా జాగ్రత్తగా వెతికి నగను వెతికి తీసి చిరాగ్ శర్మకు తిరిగిచ్చారు. దీంతో, వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది.

Viral: దీపావళి అంటే ఇదీ.. అబ్బుర పరుస్తున్న డ్రోన్ ఫుటేజీ!


మేయర్ నుంచి సమాచారం అందగానే ముందు తాము ట్రక్ డ్రైవర్‌కు ఈ సమాచారాన్ని అందించామని స్థానిక సూపర్ వైజర్ హేమంత్ కుమార్ తెలిపారు. అది వెళ్లిన రూట్‌ను ఫాలోయ్యాక కాసేపటికి అక్కడికి చేరుకునే సరికి ట్రక్‌లోని చెత్తనంతా మరో గార్బేజ్ డంప్‌లో వేసినట్టు గుర్తించారు. ఆ తరువాత ఆ భారీ చెత్త పోగును జల్లెడ పట్టి ఎట్టకేలకు నగను దొరకపుచ్చుకున్నారు. సాధారణంగా చెత్తఏరుకునే వారు గార్బేజ్ డంప్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలను వెతికి తీసుకుంటారని, కానీ ఆ ట్రక్ చెత్తలోని చెత్తలోకి వారు దిగలేదు కాబట్టి నగ సులభంగా దొరికిందని సిబ్బంది పేర్కొన్నారు. అయితే, దీపావళి రోజున పోయిందనుకున్న నగ దొరకడంతో చిరాగ్ శర్మ కుటుంబం ఆనందానికి అంతేలేకుండా పోయింది. నగర మేయర్‌కు, మున్సిపల్ సిబ్బందికి వారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Read Latest and Viral News

Updated Date - Oct 31 , 2024 | 12:14 PM