Share News

Viral News: వీళ్లెవరో అంబానీని మించిపోయారు.. ఏకంగా టాయిలెట్‌లో కూడా ఏసీ పెట్టుకున్నారు.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:24 PM

ప్రస్తుతం ఎండ వేడి ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతున్నాయి. దక్షిణాదిన 45 డిగ్రీలను దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారు.

Viral News: వీళ్లెవరో అంబానీని మించిపోయారు.. ఏకంగా టాయిలెట్‌లో కూడా ఏసీ పెట్టుకున్నారు.. వీడియో వైరల్!
AC in the Toilet

ప్రస్తుతం ఎండ వేడి (Summer) ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతున్నాయి. దక్షిణాదిన 45 డిగ్రీలను దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి (AC Jugaad videos). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ ఇంటి టాయిలెట్‌లో కూడా ఏసీని ఫిట్ చేసుకున్నారు (Viral Video).


haseenkhan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంటి బాత్రూమ్ కనిపిస్తోంది. అయితే ఆ బాత్రూమ్‌లో పైన ఓ ఏసీని కూడా ఫిట్ చేసి ఉంచారు. ఉత్తరప్రదేశ్‌ లో (Uttarpradesh)ని ఘజియాబాద్‌లో ఓ ఇంట్లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు (AC in the Toilet).


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 3 లక్షల లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నా కలల వాష్‌రూమ్``, ``బ్రదర్, ఇది ధనవంతులకు మాత్రమే పరిమితం``, ``ఇది నిజంగా ఆశ్చర్యకరం``, ``అంబానీ ఇంటిలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉండదేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టండి..!


Viral Video: వామ్మో.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏసీ పేలిపోతుందా?.. పంజాబ్‌లో షాకింగ్ ఘటన!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2024 | 05:24 PM