Share News

Viral Video: ఇదెక్కడి మాస్ స్టంట్‌రా బాబూ.. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఎలా ఎగిరిపోయాడో చూడండి..!

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:59 PM

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం చాలా మంది సాహసాలు, విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు తమ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేయడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి ఎన్నో ప్రమాదకర బైక్ స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి.

Viral Video: ఇదెక్కడి మాస్ స్టంట్‌రా బాబూ.. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఎలా ఎగిరిపోయాడో చూడండి..!
Bike stunt

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం చాలా మంది సాహసాలు, విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు తమ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేయడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి ఎన్నో ప్రమాదకర బైక్ స్టంట్ వీడియోలు (Bike Stunts) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్న వీడియో అంతకు మించి.. అన్నట్టు ఉంది. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఏకంగా గాల్లోకి ఎగిరిపోయాడు. ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఏకంగా 20 కోట్ల మందికి పైగా వీక్షించారు (Viral Video).


official_hem_sa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు వ్యక్తులు ఇసుకలో ఉన్నారు. అంతలో ఓ బైక్ రయ్యిమని దూసుకొచ్చింది. గాల్లోకి ఎగిరింది. ఆ దెబ్బకు బైక్‌పై వెనుక కూర్చన్న వ్యక్తి గాల్లోకి అంత ఎత్తున ఎగిరిపోయాడు. బైక్ ముందుకు వెళ్లిపోగా ఆ వ్యక్తి అంత ఎత్తు నుంచి కింద ఉన్న ఇసుకలో పడిపోయాడు. చుట్టూ ఉన్న వారు ఆ స్టంట్ చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.


రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. లక్షల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా తమ స్పందనలను తెలియజేశారు. ``అది బైక్ కాదు.. హెలికాఫ్టర్``, ``ఆ మనిషి పక్షిలా మారిపోయాడు``, ``ఓ మై గాడ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇలాంటి భర్త కోసం ఎన్ని పూజలైనా చేస్తాం.. భార్యతో కలిసి అతడు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!


Picture Puzzle: ఈ పిల్లులకు హెల్ప్ చేస్తారా? ఆ నీటిలో ఎలుక ఎక్కడుందో 10 సెకెన్లలో వెతికిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 21 , 2024 | 03:59 PM