Share News

Viral Video: ఆ యువకుడు తోపు.. ఎందుకంటే

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:35 PM

సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలతో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అవుతారు. డిఫరెంట్‌గా ఆలోచించి, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఓ యువకుడు ఇలానే చేశాడు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఆ యువకుడు తోపు.. ఎందుకంటే
Man Giving Bike Ride

ప్రపంచంలో ఏ మూలాలో ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. అందుకు కారణం సోషల్ మీడియా. రాత్రికిరాత్రే ఫేమస్ కావాలని కొందరు భావిస్తారు. ఆ క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో షేర్ చేస్తుంటారు. ఓ యువకుడు ఇలాగే చేశాడు. బైక్ మీద వెళుతూ.. లిఫ్ట్ ఇచ్చాడు. ఆ లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలిస్తే షాకవడం ఖాయం.


బొమ్మను కూర్చొబెట్టుకొని..

బైక్ మీద ఓ యువకుడు వెళుతున్నాడు. హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రావెల్ చేస్తున్నాడు. అతని వెనకాల ఓ అతిథి ఉంది. ఆ గెస్ట్‌ను నిశీతంగా పరిశీలిస్తే గానీ తెలుసుకోలేం. ఎందుకంటే అది చిన్నది. అవును వెనకాల చిన్న బొమ్మను కూర్చొబెట్టుకున్నాడు. ఆ వీడియో చూస్తే నవ్వడం ఖాయం. ఆ వ్యక్తి వెనకాల చిన్న బొమ్మ ఉంది. ఇతనేంటి డాల్‌‌ను ఈ విధంగా తీసుకెళ్తున్నాడని అంతా చర్చిస్తున్నారు. ఆ వీడియోకు ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.


viral.jpg


లాస్ట్ ఆప్షన్

సోషల్ మీడియా ఎక్స్‌లో మస్కాన్ అనే వ్యక్తి ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు ద లాస్ట్ ఆప్షన్ ఫర్ బాయ్స్ అని క్యాప్షన్ రాశారు. అంటే బొమ్మను తీసుకెళ్లడం ఆ యువకుడి చివరి ఎంపిక అవుతుందనే ఉద్దేశంతో రాశారు. వీడియోను ఇప్పటికే 21 వేల మంది చూశారు. పలువురు కామెంట్ చేశారు. ‘ఆ వ్యక్తితో ఉండే ఆ బొమ్మ అయినా సరిగ్గా ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేశారు. ఆ యువకుడికి ఇదే లాస్ట్ ఆప్షన్ అని రాసుకొచ్చారు. ఈ రోజు వస్తోందని నేను అనుకోలేదని మరొకరు రాశారు. ఇలా పలువురు తమ అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. ఆ యువకుడు సరదాకి బొమ్మను వెనకాల కూర్చొంటే.. అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదని అర్థంతో కామెంట్ చేశారు. ఆ బొమ్మే అతనికి చివరి ఆప్షన్ అని సెటైర్లు వేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 17 , 2024 | 03:35 PM