Share News

Viral Video: పాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యమేమో.. కూతురి తలపై సీసీటీవీ అమర్చిన వ్యక్తి.. ఎందుకంటే..

ABN , Publish Date - Sep 08 , 2024 | 07:46 PM

సాధారణంగా సీసీటీవీ కెమెరాలను ఇళ్లలోనూ, ఆఫీస్‌ల్లోనూ, రోడ్ల మీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అమర్చుతారు. సెక్యూరీటీ కారణాల రీతా సీసీటీవీ కెమేరాలన అమర్చుతారు. అయితే పాకిస్తాన్‌లోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తన కూతురి తలపైనే సీసీటీవీ కెమెరాను అమర్చాడు.

Viral Video: పాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యమేమో.. కూతురి తలపై సీసీటీవీ అమర్చిన వ్యక్తి.. ఎందుకంటే..
Man installs CCTV on daughter`s head

సాధారణంగా సీసీటీవీ (CCTV) కెమెరాలను ఇళ్లలోనూ, ఆఫీస్‌ల్లోనూ, రోడ్ల మీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అమర్చుతారు. సెక్యూరీటీ కారణాల రీత్యా సీసీటీవీ కెమేరాలన అమర్చుతారు. అయితే పాకిస్తాన్‌ (Pakistan)లోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తన కూతురి (Daughter) తలపైనే సీసీటీవీ కెమెరాను అమర్చాడు. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. కరాచీకి చెందిన ఆ యువతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తలపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఉందో వివరించింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ యువతితో మాట్లాడాడు. తన తలపై సీసీటీవీని తన తండ్రి ఏర్పాటు చేశారని చెప్పింది. ``నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో ప్రతి విషయం తెలుసుకోవాలని మా నాన్న అనుకున్నారు.`` అని ఆమె చెప్పింది. అందుకు మీరు అభ్యంతరం చెప్పలేదా అని అడిగితే.. ఆమె ``లేదు`` అని చెప్పింది. ``నా రక్షణ కోసమే మా నాన్న ఈ ఏర్పాటు చేశారు. మా నాన్న నా సెక్యూరిటీ గార్డు. ప్రస్తుతం కరాచీలో పరిస్థితులు చూస్తున్నాం కదా`` అంటూ ఆ యువతి ఆ వీడియోలో పేర్కొంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.4 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``ఇది అంత సర్‌ప్రైజింగ్ ఏమీ కాదు.. పాకిస్తాన్‌లో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు``, ``హై లెవెల్ సెక్యూరిటీ..``, ``డిజిటల్ పాకిస్తాన్``, ``పాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాపం.. దొంగకు టైం కలిసి రాలేదు.. తుపాకీ గురిపెట్టి బైక్ చోరీకి యత్నం.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..


Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..


Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2024 | 07:46 PM