Viral: చికెన్ టిక్కా చాక్లెట్.. ఇదేం ఘోరం అంటూ మండిపడుతున్న జనాలు!
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:29 PM
చికెన్ టిక్కా మసాలా అంటే ఎందరో భారతీయులకు ఇష్టమైన వంటకం. ఇలాంటి వారికి తమ ఇష్టమైన వంటకంపై ప్రయోగాలు చేస్తే అస్సలు సహించరు. నిలబెట్టి కడిగేస్తారు. దుమ్ముదులిపి వదిలిపెడతారు. ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట అదే జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: చికెన్ టిక్కా మసాలా అంటే ఎందరో భారతీయులకు ఇష్టమైన వంటకం. ఇలాంటి వారికి తమ ఇష్టమైన వంటకంపై ప్రయోగాలు చేస్తే అస్సలు సహించరు. నిలబెట్టి కడిగేస్తారు. దుమ్ముదులిపి వదిలిపెడతారు. ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట అదే జరుగుతోంది. చాక్లెట్, చికెన్ టిక్కా మసాలా కలిపి ఓ కొత్త కాంబినేషన్ తయారు చేయబోయిన వ్యక్తిని తెగ తిట్టిపోస్తున్నారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది (Viral).
Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, జర్మనీలో భారత సంతతి వ్యక్తికి చెందిన ఓ రెస్టారెంట్ ఈ వింత వంటకం వెలుగుచూసింది. అక్కడి షెఫ్ ఒకరు ఈ ప్రయోగానికి సిద్ధపడ్డారు. వీడియో మొదట్లో మామూలు చాక్లెట్ సిద్ధం చేస్తున్నట్టే కనిపిస్తుంది. సదరు షెఫ్ ముందుగా చాక్లెట్ మౌల్డ్‌లో చాక్లెట్ పేస్టును ఒక పొరలాగా పూశాడు. ఆపై కొంత ఫుడ్ కలర్ కూడా చల్లాడు.
ఆ తరువాతే వీడియో అనూహ్య మలుపు తిరిగింది. మొదటి పొరపై అతడు ఏకంగా చికెన్ టిక్కా మసాలా పరిచాడు. ఆ తరువాత దానిపై రెండో పొరగా మళ్లీ చాక్లెట్ పొర పరిచి అది గడ్డకట్టేందుకు పక్కన పెట్టేశాడు. చాక్లెట్ గట్టిగా మారా దాన్ని మూసలోంచి బయటకు తీసి రెండు ముక్కలుగా చేసి మధ్యలో ఉన్న చికెన్ టిక్కా మసాలాను చూపించాడు.
Gujarat: కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక వేళ్లు నరికేసుకున్న వ్యక్తి!
భోజనప్రియులకు తిక్కరేలాన్నట్టు తన ఘన కార్యాన్ని అతడు వెలిగిపోతున్న ముఖంతో కెమెరా ముందు ప్రదర్శించడంతో జనాలకు మండుకొచ్చింది. దీంతో, నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఇదంతా అవసరమా అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. ఇలాంటి పని చేసినందుకు ఇతగాణ్ణి జైల్లో పెట్టాలని మరో వ్యక్తి అన్నాడు. ఈ ప్రయోగంతో అతడు హద్దుమీరేశాడని కొందరు మండిపడ్డారు. ఇలాంటి కాంబినేషన్లు అసలు ఉండకూడదు అని కొందరు తేల్చి చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇలాంటి కాంట్రవర్షియల్ వీడియోలకు జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తుంటారు కాబట్టి ఈ వీడియోకు ప్రస్తుతం భారీగా వ్యూస్ వచ్చి పడుతున్నాయి. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి.
Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..
Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..