Share News

Viral: మరీ ఇలా తెగించేస్తున్నారేంట్రా.. పెట్రోల్ బంక్‌లో ప్రాణాలతో చెలగాటమా!!

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:22 PM

కారులో డీజిల్ ఒలికిపోయేంతలా నింపి షార్ట్ వీడియోకు పోజులిచ్చిన ఓ యువకుడి ఉదంతం నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఘటనపై స్పందించిన పోలీసులు తగు చర్యలు తీసుకుంటామంటూ ఆగ్రహంతో ఉన్న నెటిజన్లకు సమాధానం ఇచ్చారు.

Viral: మరీ ఇలా తెగించేస్తున్నారేంట్రా.. పెట్రోల్ బంక్‌లో ప్రాణాలతో చెలగాటమా!!

ఇంటర్నెట్ డెస్క్: షార్ట్ వీడియోల ఉన్మాదం యువతలో పెట్రేగుతోంది. నెట్టింట వ్యూస్, ఫాలోవర్స్ పెంచుకోవాలనే యోచనలో కంటెంట్ క్రియేటర్లు అనేక మంది తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్నారు. తమ తీరు ఎంతటి ప్రమాదకరమో కూడా గుర్తించలేనంతగా షార్ట్ వ్యసనంలో కూరుకుపోతున్నారు. ఇందుకు తాజాగా ఉదాహరణగా ధనవంతుడైన ఓ యువకుడి వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) ఉంది. పెట్రోల్ బంక్‌లో అతడు చేసిన పని చూసి జనాలు నివ్వెరపోతున్నారు.

Viral: చీరల డిజైన్‌లో ఊహించని విప్లవం! మహిళలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


రాజస్థాన్‌లోని ఆజ్మెర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియోను ఓ జర్నలిస్టు షేర్ చేస్తూ సదరు యువకుడిపై మండిపడ్డాడు. వీడియోలోని యువకుడు పెట్రోల్ బంక్‌లో రీల్స్ చేసే క్రమంలో దారుణానికి తెగబడ్డాడు. కారులో డీజిల్ నింపుతున్న అతడు రీల్స్ కోసమని.. ట్యాంకు నిండిపోయి డీజిల్ బయట ఒలుకుతున్నా లెక్కచేయకుండా అలాగే ట్యాంకు నింపుతూ వీడియోకు పోజిచ్చాడు. మరో వీడియోలో అతడు డీజిల్ పైపును ట్యాంకులోకి దూర్చకుండా బయటకు పట్టుకుని డీజిల్ నేలపాలయ్యేలా చేశాడు. మరో వీడియోలో హైవేపై కారులో వెళుతూ ప్రమాదకర స్టంట్లు చేశాడు (Man overfills SUVs tank for reel Ajmer Police intervenes).

వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు యువకుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంత డబ్బుంటే మాత్రం ఇతరులను ప్రమాదంలో నెట్టేసేలా చెలరేగిపోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు, వీడియోను రీట్వీట్ చేస్తూ స్థానిక పోలీసులను ట్యాగ్ చేశారు. ఘటనపై స్పందించిన పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం అందించామని బదులిచ్చారు. ఇదిలా ఉంటే వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఐదు లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

Read Viral and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 03:54 PM