Share News

Viral: ఆటోలో ఒంటరిగా మహిళ.. సడెన్‌గా ఓ వ్యక్తి లోపలికొచ్చి.. షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:28 PM

యువతే కదా ఏం చేస్తుందిలే అనుకుని బెదిరించబోయిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఆటోలో ఒంటరిగా మహిళ.. సడెన్‌గా ఓ వ్యక్తి లోపలికొచ్చి.. షాకింగ్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: యువతియే కదా ఏం చేస్తుందిలే అనుకుని బెదిరించి డబ్బులు వసూలు చేయబోయిన ఆగంతుకుడికి ఊహించని షాక్ తగిలిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పోలీసునని చెప్పుకుంటూ ఓ వ్యక్తి తనను ఎలా బెదిరించబోయిందీ బాధితురాలు వివరించిన వీడియోను ఆమె సోదరి నెట్టింట పంచుకుంది. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..


Viral: రాధికా మర్చెంట్ బర్త్‌డే వేడుక.. వదిన కేక్ ఇస్తే వద్దన్న ఆకాశ్ అంబానీ!

సదరు యువతి ముంబై ఇండస్ట్రియల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఆటోలో ఒంటరిగా వెళ్లసాగింది. అప్పటికి చేతిలో ఈ సిగరెట్ కూడా ఉంది. ఇది గమనించిన దుండగుడు తొలుత ఆమెను కొంత దూరం అనుసరించాడు. ఆ తరువాత ఆటోను ఆపి తాను పోలీసునని చెప్పుకొచ్చాడు. ఈ-సిగరెట్ తాగితే జైలు పాలుకాక తప్పదంటూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులేకపోతే తనతో పాటు పవాకీ చౌకీకి రావాలని హుకుం జారీ చేశాడు. యువతి చేతిలోంచి ఈసిగరెట్ లాక్కుని తనూ పొగతాగాడు. సివిల్ దుస్తుల్లో ఉన్న అతడి తీరు చూసి యువతి తొలుత భయపడినా వెంటనే తేరుకుని అతడి మోసాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది.

Viral: భూమ్మిద నూకలు ఇంకా మిగిలుండటం అంటే ఇదే! షాకింగ్ వీడియో!


అతడి మోసం పసిగట్టిన వెంటనే తన సెల్‌ఫోన్‌లో ఈ మొత్తం ఉదంతాన్ని రికార్డు చేయడం ప్రారంభించింది. కెమెరా అతడివైపు చూపెట్టి.. మహిళా కానిస్టేబుల్ లేకుండా ఎందుకొచ్చారని నిలదీసింది. దీంతో, అతడు నీళ్లు నమిలాడు, పైపెచ్చు ఆమె తనను రికార్డు చేయడంతో ఆమె చేయిపక్కకు తోశాడు. ఇక తన ఆటలు చెల్లవనుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.

ఈ ఉదంతంతో తన సోదరి తీవ్ర షాక్‌ గురైందని, తన పేరును కూడా అతడికి చెప్పిందని వివరించింది. అయితే, ఆ వ్యక్తి ఆటో దిగుతూ నీ సంగతి తరువాత తేలుస్తా అని బెదిరించి వెళ్లిపోయాడని పేర్కొంది.

ఇక నెట్టింట వీడియో చూసిన జనాలు షాకైపోతున్నారు. పట్టపగలు కూడా నేరగాళ్లు ఇలా తెగిస్తున్నారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరికొందరు మాత్రం మహిళ తెగువకు మెచ్చుకున్నారు. నిందితుడి బెదిరింపులకు లొంగిపోకుండా అతడి మోసాన్ని బట్టబయలు చేసిన తీరుకు మెచ్చుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మరికొందరు సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral: వాహనదారుడికి షాకింగ్ అనుభవం! జోరు వానలో బయటకు రావద్దనేది ఇందుకే..

Read Latest and Viral News

Updated Date - Oct 18 , 2024 | 06:39 PM