Viral: పెంపుడు కుక్కను రక్షించేందుకు ప్రాణాలకు తెగించిన యజమాని! షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Dec 24 , 2024 | 07:40 AM
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. కుక్క మీద దాడికి దిగిన భల్లూకంపై ప్రతి దాడికి దిగి దాన్ని తరిమేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి పట్ల విశ్వాసం కలిగిన జంతువు ఏదైనా ఉందీ అంటే అది కుక్క మాత్రమే. తమ యజమాని వెంటే ఉండే శునకాలు వారిని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణాలకు తెగిస్తాయి. అందుకే అనేక మంది తమ పెంపుడు శునకాలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏ ఇబ్బందీ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, తాజా వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. కుక్క మీద దాడికి దిగిన భల్లూకంపై ప్రతి దాడికి దిగి దాన్ని తరిమేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: ప్రయాణికుడి ఫస్ట్ క్లాస్ సీటును ఓ కుక్కకు కేటాయించిన ఎయిర్‌లైన్స్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ శునకాన్ని యజమాని గొలుసుతో స్తంభానికి కట్టేసి వచ్చాడు. ఆ తరువాత కొద్ది సేపటికి అక్కడకు ఓ భారీ భల్లూకం వచ్చింది. మెడకు తాడుతోనే కుక్క తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలుగుబంటిపై దాడికి దిగింది. కానీ తాడు కారణంగా సరిగా పోరాడలేకపోయింది. ఎలుగు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమైంది. ఇంతలో సీన్‌లోకి యజమాని ఎంట్రీ ఇచ్చాడు. శునకం పక్కనే నిలబడి అత్యంత ధైర్యసాహసాలతో ఎలుగుతో పోరాటానికి దిగాడు. పెద్దగా కేకలు వేస్తూ దాన్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. చేతిలో చెక్క ముక్కను తీసుకుని దానివైపు చూపిస్తు బెదిరించాడు. ఇలా శునకంతో పాటు అతడు కూడా రంగంలోకి దిగడంతో వెనకడుగు వేసిన భల్లూకం వెనక్కు తగ్గింది. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది.
Viral: ఇద్దరు భర్తలతో మహిళ కాపురం! ఎలా మేనేజ్ చేస్తున్నావని అడిగితే..
ఈ వీడియో నిడివి కేవలం 10 సెకెన్లే అయినప్పటికీ ఆ వ్యక్తి ధైర్యానికి జనాలు షాకైపోతున్నారు. దీంతో, వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘‘భల్లూకం దృష్టి మళ్లించేందుకు అతడు ప్రయత్నించాడు. అతడి వ్యూహం ఫలించింది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ సమయంలో కుక్క మెడకున్న గొలుసు తొలగించి ఉంటే బాగుండేదని మరో వ్యక్తి అన్నాడు. భల్లూకం ఇంకా చిన్న వయసులోనే ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే పెను ప్రమాదమే జరిగి ఉండేదని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ఇక ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినప్పటికీ వీడియోలోని దృశ్యాలను బట్టి అది టర్కీలో జరిగుండొచ్చని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు