Viral: గుడ్లను తింటున్న పాము! ఏం చేయలేక నిస్సహాయంగా బాతులు! ఇంతలో సడెన్‌గా..
ABN , Publish Date - Jun 08 , 2024 | 03:39 PM
పాము నుంచి బాతు గుడ్లను కాపాడిన ఓ వ్యక్తిపై నెట్టింట ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. కొందరు మాత్రం అతడు తప్పు చేశాడని చెబుతున్నారు. ఇలా భిన్నాభిప్రాయాల మధ్య అతడి వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏ జీవికైనా సాయపడగల శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. కానీ కొన్ని సార్లు అతడి చర్యలు ఉచితమేనా అన్న సందేహం కలుగుతుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది. పాము నుంచి బాతు గుడ్లను కాపాడిన అతడిపై కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ప్రకృతి తీరుతెన్నులకు అడ్డం పడుతున్నావంటూ కొందరు విమర్శించారు. అయితే, గుడ్లను కాపాడుకోలేక నిస్సహాయంగా మారిన బాతులను చూసి చలించిపోయిన కొందరు మంచిపనే చేశావంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు.
ఒకేసారి తుమ్ము, దగ్గు రావడంతో.. పొట్ట పగిలి బయటకొచ్చేసిన పేగులు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ ప్లేగ్రౌండ్ చివరన బాతులు గుడ్లు పెట్టాయి. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన పాము బాతు గుడ్లను తినడం ప్రారంభించింది. పామును తోలే ధైర్యం చేయలేక బాతులు రెండూ అక్కడే నిస్సహాయంగా చూస్తుండిపోయాయి. పాము మాత్రం తన దారిన తాను గుడ్లు తినేస్తోంది. ఈలోపు పక్కనే ఉన్న ఇంట్లోని కొందరు తమ కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూశారు. బాతు గుడ్లను రక్షించాలా వద్దా అని చాలా సేప సంశయించారు. చివరకు ఓ వ్యక్తి ధైర్యం చేసి పాము తల పట్టుకుని జాగ్రత్తగా పైకెత్తి దూరంగా విసిరేశాడు. ఇది చూడగానే సంబర పడిపోయిన ఆ బాతు మళ్లి వచ్చి గుడ్లు పొదిగేందుకు సిద్ధమైంది (Man Saves Goose Eggs From Deadly Snake).
వీడియోలో ఇదంతా చూసిన జనాలు.. గుడ్లను కాపాడిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. పాము విషపూరితమైనదో కాదో తెలియకపోయినా సాహసం చేశాడంటూ తెగ పొగిడేశారు. దేవుడిలో సీన్ లో ఎంట్రీ ఇచ్చాడంటూ మరికొందరు ప్రశంసించారు. కొందరు మాత్రం అతడి చర్యపై పెదవి విరిచారు. ఒక జీవికి మరో జీవి ఆహారం కావడం ప్రకృతి పెట్టిన నియమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడమంటే ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.