Share News

Viral: ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.60 వేల చోరీ.. 20 రోజుల్లో తిరిగిచ్చేస్తానంటూ హామీ!

ABN , Publish Date - Jul 29 , 2024 | 10:39 PM

ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.60 వేలు చోరీ చేసిన అతడి డ్రైవర్ ఆ డబ్బును మళ్లీ తిరిగి ఇచ్చేస్తానంటూ మెసేజ్ పంపించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ వింత ఘటన వెలుగు చూసింది.

Viral: ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.60 వేల చోరీ.. 20 రోజుల్లో తిరిగిచ్చేస్తానంటూ హామీ!

ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.60 వేలు చోరీ చేసిన అతడి డ్రైవర్ ఆ డబ్బును మళ్లీ తిరిగి ఇచ్చేస్తానంటూ మెసేజ్ పంపించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ వింత ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, భోపాల్‌కు చెందిన కపిల్ త్యాగీ పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం భార్యతో కలిసి ఆయన అమెరికాకు వెళ్లారు. ఆయన వద్ద దీపక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల దీపక్.. త్యాగీ తల్లిని ఫిజియోథెరపీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారి ఇంట్లో ఉన్న రూ.60 వేలు తీసుకెళ్లిపోయాడు.

Viral: గుమ్మడికాయ నుంచి ఊహించని సిగ్నల్! దాన్ని కోసి చూసిన పోలీసులకు షాక్!


ఆ తరువాత త్యాగీ కుమారుడికి ఈ విషయంపై మెసేజ్ పెట్టాడు. మీ డబ్బు ఎక్కడికీ పోలేదు.. నేనే తీసుకెళ్లా.. 20 రోజుల్లో తిరిగిచ్చేస్తా అని మొబైల్‌లో సందేశం పంపించాడు. దీంతో, షాకయిపోయిన యువకుడు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకున్న వారు నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడని, తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్టు చేస్తూ ఉంటాడని పోలీసులు గుర్తించారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 10:39 PM