Viral: కూతురి రూపురేఖలు చూసి తండ్రికి డౌట్! డీఎన్ఏ టెస్టు చేయిస్తే..
ABN , Publish Date - Nov 10 , 2024 | 06:42 PM
కూతురికి తన పోలికలు లేకపోవడంతో అనుమానపడ్డ ఓ వ్యక్తి డీఎస్ఏ టెస్టు చేయిస్తే అతడి అనుమానం నిజమైంది. అయితే, ఆ చిన్నారి మరొకరి కూతురని, ఆసుపత్రి సిబ్బంది పొరపాటు కారణంగా తన కూతురు కూడా మరో కుటుంబంలో పెరుగుతోందని తెలిసి అతడు దిమ్మెరపోయాడు. వియత్నాంలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తన పోలీకలు ఏవీ లేకుండా ఉన్న కూతురిని చూస్తే ఆ తండ్రికి ఎప్పటి నుంచో డౌట్. ఆమె తన కూతురు కాదన్న అనుమానం రాను రాను బలపడటంతో చివరకు బలవంతంగా కూతురికి, తనకు డీఎన్ఏ టెస్టు చేయించాడు. అతడు ఊహించినట్టుగానే ఆ బాలిక తన కూతురు కాదని తేలడంతో కుటుంబం రణరంగంగా మారింది. తానే తప్పూ చేయలేదని ఎంతగా చెబుతున్నా భర్త వినికపోడంతో అతడి భార్య, కూతురిన తీసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో వారి కథ ఊహించని మరో మలుపు తిరిగి ఆ తండ్రి కూడా దిమ్మెరపోయేలా చేసింది. వియత్నాలంలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
Viral: వామ్మో.. జూలో జింకకు ఎంత తెలివో చూడండి!
ఇన్నాళ్లూ తన కూతురిగా ప్రపంచానికి తెలిసిన హాన్ వాస్తవానికి తన సంతానం కాదని తెలియగానే ఆ తండ్రి తలకిందులైపోయాడు. భార్య తనను మోసం చేసిందన్న బాధలో తాగుడుకు బానిసయ్యాడు. వారి కుటుంబం కలహాల కొలిమిగా మారిపోయింది. అతడు రొజూ తాగి ఇంటికొచ్చి భార్యను వేధిస్తుండేవాడు. తానేపాపం ఎరగనని ఎంతగా మొత్తుకున్నా అతడు వినిపించుకోలేదు. చివరకు అతడితో వేగలేనంటూ భార్య తన కూతురు హాన్‌ను తీసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయింది. మరో ప్రాంతంలో నివసించసాగింది. అక్కడే ఓ స్కూల్లో హాన్‌ను చేర్పించింది.
Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..
ఆ స్కూల్లో ఉండగానే హాన్‌కు మరో బాలికతో స్నేహం కుదిరింది. ఎంతగా అంటే ఆమె ఆ బాలిక ఇంటికి కూడా వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలో హాన్‌ను చూసిన బాలిక తల్లి ఆశ్చర్యపోయింది. తొలిసారిగా చూస్తున్న హాన్ అచ్చు తనలాగే ఉండటంతో ఆమెకు నోటమాటరాలేదు. ఈ విషయం హాన్ కుటుంబంలోనూ కలకలానికి దారి తీసింది. దీంతో, రెండు కుటుంబాలు డీఎన్ఏ టెస్టు చేయించుకోవడం మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి హాన్ ఆ మహిళ కూతురేనని, ఆసుపత్రిలో జరిగిన పొరపాటు కారణంగా ఒకరి సంతానం మరొకరి ఇంట్లో పెరిగినట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా అనూహ్యంగా తమ దారులు వేరుపడి మళ్లీ కలవడంతో ఆ చిన్నారులు వారి తల్లిదండ్రులకు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవట్లేదు. జీవితాల్ని తారు మారు చేసే భారీ తప్పిదానికి పాల్పడిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలా వాద్ద అనే విషయంలో ప్రస్తుతం ఇరు కుటుంబాలు తర్జనభర్జనలు పడుతున్నాయి.