Share News

Viral Video: నాగుపాము ముందు హీరోయిజం చూపిద్దామనుకుంటే అలాగే ఉంటుంది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

ABN , Publish Date - Jun 05 , 2024 | 03:35 PM

ప్రమాదాలతో ఎప్పుడూ ఆటలాడుకూడదని అందరికీ తెలుసు. కానీ, కొందరు వ్యక్తులు తమను తాము హీరోలుగా చూపించుకోవడానికి మృత్యువుతో ఆటలాడుతుంటారు. ప్రమాదకర సాహసాలు చేస్తారు. అలా చేసేటపుడు ఒక్కోసారి విపత్కర పరిస్థితులు ఎదురుకాకతప్పదు. ముఖ్యంగా విషపూరిత సర్పాలతో వ్యవహరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

Viral Video: నాగుపాము ముందు హీరోయిజం చూపిద్దామనుకుంటే అలాగే ఉంటుంది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
Stunt with snake

ప్రమాదాలతో ఎప్పుడూ ఆటలాడుకూడదని అందరికీ తెలుసు. కానీ, కొందరు వ్యక్తులు తమను తాము హీరోలుగా చూపించుకోవడానికి మృత్యువుతో ఆటలాడుతుంటారు. ప్రమాదకర సాహసాలు (Dangerous Stunts) చేస్తారు. అలా చేసేటపుడు ఒక్కోసారి విపత్కర పరిస్థితులు ఎదురుకాకతప్పదు. ముఖ్యంగా విషపూరిత సర్పాలతో (Snake) వ్యవహరించేటపుడు జాగ్రత్తగా ఉండాలి. నిష్ణాతులైతే తప్ప పాముల జోలికి వెళ్లకూడదు. వెళితే ఏం జరుగుతుందో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది (Viral Video).


anan_10k అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రోడ్డుపై భారీ నాగుపాము ఉండిపోయింది. దాంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులందరూ ఆగిపోయారు. బయటకు వచ్చి ఆ భారీ సర్పాన్ని చూస్తున్నారు. అంతలో ఓ వ్యక్తి అక్కడకు కర్ర పట్టుకుని వచ్చి హీరోయిజం ప్రదర్శించాలనుకున్నాడు. పామును బెదిరించాడు. దాని తోక పట్టుకుని పైకి లేపి కర్రతో దానిని నియంత్రించాలనుకున్నాడు. అయితే ఆ పాము ఆ వ్యక్తి కాలిపై (Snake Bite) పలుసార్లు కాట్లు వేసింది.


చివరకు ఏం జరిగిందో ఆ వీడియోలో లేదు కానీ, ఆ కుర్రాడు మాత్రం పాము కాటుకు గురైనట్టు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``జీవితంతో ఆటలాడకండి``, ``కింగ్ కోబ్రాతో జోక్ చేస్తే అలాగే ఉంటుంది``, ``పాములు పట్టుకునే వాళ్లెవరూ కర్రను పట్టుకోరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: చివరి వరకు కలిసే ఉండాలని ఒట్టేసుకున్నారు.. తర్వాత వారి పరిస్థితి ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!


Viral: వామ్మో.. నవ్వు ఎంత పని చేసింది.. విపరీతంగా నవ్వి హాస్పిటల్ పాలైన వ్యక్తి.. డాక్టర్ ఏం చెప్పారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2024 | 03:35 PM