Share News

Viral Video: చివరి వరకు కలిసే ఉండాలని ఒట్టేసుకున్నారు.. తర్వాత వారి పరిస్థితి ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:56 PM

ఇటలీలో ప్రస్తుతం తీవ్ర వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Viral Video: చివరి వరకు కలిసే ఉండాలని ఒట్టేసుకున్నారు.. తర్వాత వారి పరిస్థితి ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Friends stuck in River

ఇటలీ (Italy)లో ప్రస్తుతం తీవ్ర వర్షాల కారణంగా వరదలు (Flash Floods) ముంచెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఆ క్రమంలో ఓ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు యువతీయువకులు (Three friends) గల్లంతైన వీడియో చాలా మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది (Viral Video).


ఇటలీలోని ఓ నదిలోకి భారీగా నీరు చేరడంతో చుట్టు పక్కల ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చాలా మంది ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే ఓ ముగ్గురు స్నేహితులు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) మాత్రం వరదలో చిక్కుకుపోయారు. ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోయారు. ముగ్గురూ కౌగిలించుకుని, ఏం జరిగినా చివరకు వరకు కలిసే ఉండాలని ఒట్టేసుకున్నారు. అయితే నీటి మట్టం క్రమంగా పెరగడంతో వారు అందులో కొట్టుకుపోయారు. ఆ తర్వాత వారు ప్రాణాలు కోల్పోయారు (Flood In Italy River).


ఆ ముగ్గురి గురించి తెలుసుకున్న రెస్క్యూ టీమ్ వారిని రక్షించడానికి హెలీకాఫ్టర్‌లో అక్కడకు చేరుకుంది. వారికి ఓ తాడు విసిరింది. అయితే ఆ సమయంలోనే వారు నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుని పోయారు. ఆ ముగ్గురు స్నేహితులను కార్మోస్ (20), డోరోస్ (23), మోల్నార్ (25)గా గుర్తించారు. ఘటన జరిగిన ఒక కిలోమీటరు దూరంలో కోర్మోస్, డోరోస్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మోల్నార్ మృతదేహం కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: ఈ ఫొటోలో ``A`` ఎక్కడుందో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!


Viral: వామ్మో.. నవ్వు ఎంత పని చేసింది.. విపరీతంగా నవ్వి హాస్పిటల్ పాలైన వ్యక్తి.. డాక్టర్ ఏం చెప్పారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2024 | 12:56 PM