Viral Video: తెలివి చూస్తే ఔరా అనాల్సిందే కానీ, బట్టలు కుట్టడం కోసం అంత ఖర్చు అవసరమా..?
ABN , Publish Date - Oct 13 , 2024 | 04:27 PM
దేశీ జుగాడ్‌కు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని అందర్నీ ఆలోచింప చేస్తాయి. మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ జుగాడ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో భారతీయులను మించిన వారు లేరు. దేశీ జుగాడ్‌కు (Desi Jugaad) సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని అందర్నీ ఆలోచింప చేస్తాయి. మరికొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ జుగాడ్ వీడియో (Jugaad Video) బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆ వీడియోలోని ఓ వ్యక్తి కుట్టు మెషిన్ (Sewing machine)ను ఆపరేట్ చేసేందుకు బైక్‌ను ఉపయోగిస్తున్నాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
sarcasticschool అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బైక్ (Bike) స్టాండ్ వేసి ఉంది. ఆ బైక్ వెనుక చక్రానికి తగిలేలా కుట్టు మెషిన్‌ను అమర్చారు. ఓ వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి ఎక్సలరేట్ ఇవ్వగానే వెనుక చక్రం తిరుగుతోంది. ఆ వెనుక టైర్‌కి ఆనుకుని ఉన్న కుట్టు మెషిన్ చక్రం కూడా తిరగడంతో మెషిన్ పని చేస్తోంది. ఓ వ్యక్తి అక్కడ కూర్చుని బట్టలు కుడుతున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయయంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు.
ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసించగా, మరికొందరు పెదవి విరిచారు. ``అద్భుతమైన తెలివితేటలు``, ``స్వచ్ఛమైన దేశీ జుగాడ్``, ``ఈ టెక్నిక్ భారత్ దాటి బయటకు వెళ్లకూడదు``, ``బ్రదర్.. పెట్రోల్ చాలా ఖరీదైనది.. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది``, ``ఆ మాత్రం పనికి ఇద్దరు అవసరమా``, ``కరెంట్ సహాయంతో ఒక్కరు చేసే పనిని, ఇలా పెట్రోల్ ఉపయోగించి మరీ ఇద్దరు చేయడం అవసరమా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. రాణి గీసిన చిత్రంలోని కప్ప ఏదో సరిపోల్చండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..