Share News

Viral: 6 నెలల తరువాత కోమాలోంచి బయటపడ్డ యువకుడికి భారీ షాక్!

ABN , Publish Date - Aug 17 , 2024 | 06:26 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోయిన ఓ అమెరికా యువకుడు ఆరు నెలలకు కోలుకున్నాడు. ఆ తరువాత ఆసుపత్రి బిల్లు చూసుకుని అతడు నోరెళ్లబెట్టాడు. 2015లో ఈ ఘటన జరగ్గా నాటి అనుభవాలను ఆ వ్యక్తి తాజాగా రెడిట్ పోస్టులో పంచుకున్నాడు.

Viral: 6 నెలల తరువాత కోమాలోంచి బయటపడ్డ యువకుడికి భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోయిన ఓ అమెరికా యువకుడు ఆరు నెలలకు కోలుకున్నాడు. ఆ తరువాత ఆసుపత్రి బిల్లు చూసుకుని అతడు నోరెళ్లబెట్టాడు. 2015లో ఈ ఘటన జరగ్గా నాటి అనుభవాలను ఆ వ్యక్తి తాజాగా రెడిట్ పోస్టులో పంచుకున్నాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.


కారు ప్రమాదంలో తాను తీవ్ర గాయాలపాలయ్యానని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో, కోమాలోకి వెళ్లిపోయానని అన్నాడు. ఆరు నెలల తరువాత కోమాలోంచి బయటపడ్డట్టు చెప్పుకొచ్చాడు. ఆఫీసుకు వెళ్లాలనుకుంటూ తాను మేలుకున్నట్టు చెప్పుకొచ్చాడు. బాత్రూమ్‌కు వెళ్లాలని అక్కడే ఉన్న నర్సును అడగడంతో ఆమె తొలుత భయపడి గదిలోంచి పారిపోయిందని అన్నాడు. ఆ తరువాత తేరుకుని లోపలికొచ్చి తనకు క్షమాపణ కూడా చెప్పిందన్నాడు.

Viral: రీల్స్ కోసం ఈ అత్తాకోడళ్లు ఏం చేశారో చూస్తే..

ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నందుకు తనకు రూ.2.5 కోట్ల బిల్లు అయ్యిందని తెలిపాడు. అది చెల్లించేందుకు ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించినా కావాల్సిన మొత్తం రాలేదని చెప్పాడు. చివరకు మిగతా డబ్బును తన లాయరే సమకూర్చాడని వివరించాడు.


ఆ కష్టసమయంలో తను ఉద్యోగం చేస్తున్న సంస్థ యాజమాన్యం అండగా నిలిచిందని తెలిపాడు. ఆ ఏడాది ఇన్సూరెన్స్ ఖర్చులను మొత్తం భరించిందని పేర్కొన్నాడు. సంస్థ ఉన్నతోద్యోగులు కూడా పలుమార్లు ఆసుపత్రికి వచ్చి తనను సందర్శించి వెళ్లినట్టు చెప్పాడు. అంతేకాకుండా, సహోద్యోగులు కొందరు తన దుస్తులు కూడా ఉతికేవారని చెప్పుకొచ్చాడు. అప్పట్లో తన పరిస్థితిపై నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలిపాడు. సంస్థ యాజమాన్యం కారణంగానే తాను ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ వారు తనకూ మద్దతుగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. అనేక మంది ఇప్పటికీ తన లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ వేదికగా ఈ విషయాలు పంచుకున్నట్టు తెలిపాడు.

Read Viral and Telugu News

Updated Date - Aug 17 , 2024 | 06:27 PM