Share News

Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:26 PM

ఒకతను బ్లింకిట్‌లో మెన్ అండర్ వేర్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చూసి ఖంగుతిన్నాడు. లేడీస్ బికిని బ్రీఫ్ వచ్చింది. పొరపాటు జరిగిందని వెంటనే హెల్ప్ సెంటర్‌ను ఆశ్రయించాడు. నేను ఆర్డర్ చేసింది మేల్ డ్రాయర్ అయితే ఫీమేల్ అండర్ వేర్ పంపించారని కంప్లైంట్ చేశాడు. దీనిని ఏ విధంగా రిటర్న్ చేయాలని అడిగారు.

Viral News: అండర్ వేర్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. చివరికి
Blinkit Order

ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్. చివరికి అండర్ వేర్లను కూడా ఆన్ లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. అందులో కొందరికి చికాకులు తప్పవు. ఆర్డర్ చూసుకొని, ప్యాక్ చేసే సమయంలో తప్పులు జరగడం కామన్. వాటిని సరిదిద్దుకోవాలి. ఈ-కామర్స్ సైట్ బ్లింకిట్ (Blinkit) అలా చేయలేదు. దాంతో ఆ వ్యక్తికి కోపం వచ్చింది. జరిగినదంతా సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్ కాస్త తెగ వైరల్ అయ్యింది.


ఇది విషయం

ఒకతను బ్లింకిట్‌లో మెన్ అండర్ వేర్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చూసి ఖంగుతిన్నాడు. లేడీస్ బికిని బ్రీఫ్ వచ్చింది. పొరపాటు జరిగిందని వెంటనే హెల్ప్ సెంటర్‌ను ఆశ్రయించాడు. నేను ఆర్డర్ చేసింది మేల్ డ్రాయర్ అయితే ఫీమేల్ అండర్ వేర్ పంపించారని కంప్లైంట్ చేశాడు. దీనిని ఏ విధంగా రిటర్న్ చేయాలని అడిగారు. రిటర్స్ తీసుకొని, నగదు రీ ఫండ్ చేయాలని కోరారు. ఇప్పటివరకు బ్లింకిట్ నుంచి రెస్పాన్స్ రాలేదని ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.


blinl.jpg


ఆ తర్వాత..

కొన్ని గంటల తర్వాత మరో పోస్ట్ చేశారు. బ్లింకిట్ రీఫండ్ చేసేందుకు అంగీకరించలేదు. సో.. అందుకే నేను రాజీపడ్డాను అని రాసుకొచ్చాడు. అంతే అతనే అండర్ వేర్ వేసుకున్నాడు. లేడీస్ అండర్ వేసుకున్న ఫొటో, వచ్చిన ఆర్డర్ పిక్ పక్క పక్కన పెట్టి ఫొటో తీశాడు. దానిని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్‌ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్లతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది.


blinkitt.jpg


ఫిట్ అయ్యే అమ్మాయిని

ఆ పోస్ట్‌కు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజులో ఫన్నీ పోస్ట్ ఇదేనని ఒకరు రాసుకొచ్చారు. ఆ అండర్ వేర్ ప్యాక్ చేసిన వ్యక్తి మీరు మహిళ అని అనుకుంటారు. మీ పేరు వల్ల మిస్టేక్ అయి ఉంటుంది. అందుకోసమే పొరపాటు జరిగి ఉంటుందని మరొకరు అభిప్రాయ పడ్డారు. అలాంటి వస్తువులకు బ్లింకిట్ రిటర్న్ పాలసీ ఉండదని, బ్లింకిట్‌కు రీఫండ్, రిటర్న్ వ్యవస్థ లేదని మరొకరు రాసుకొచ్చారు. అండర్ వేర్లు రిటర్స్ చేసే వీలు లేదు.. సో, మీరు దానిని ఎవరికైనా బహుమతిగా అందజేయండి. ఒకవేళ ఆ అండర్ వేర్ కరెక్ట్‌గా సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని మరొకరు సూచించారు. దాంతో మీ డబ్బు వృథా కాకుండా పోతుందని సూచించారు. బ్లింకిట్ ఒక్కటే కాదే ఇతర ఈ కామర్స్ సైట్స్ కూడా అండర్ వేర్ల రిటర్న్ పాలసి ఉండదు.

ఇది కూడా చదవండి:

Viral: నిద్రపోతున్న వ్యక్తి ముక్కులోకి దూరిన బొద్దింక.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తలు చదవండి.

Updated Date - Sep 09 , 2024 | 04:36 PM