Viral: అసలైన ప్రేమంటే ఇదీ.. చూపు లేని గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని సర్ప్రైజ్!
ABN , Publish Date - Nov 14 , 2024 | 09:25 PM
చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఓ జంట అసలైన ప్రేమకు ప్రతిబింబంగా నిలిచింది. అంధురాలైన తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఓ యువకుడు ఇచ్చిన సర్ప్రైజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఓ జంట అసలైన ప్రేమకు ప్రతిబింబంగా నిలిచింది. అంధురాలైన తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఓ యువకుడు ఇచ్చిన సర్ప్రైజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతి షాక్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్ కని రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. ఆమె ముందు ఓ ప్లేట్ పెట్టి చేతికి ఫోర్క్ కూడా ఇచ్చాడు. అయితే, ఫ్లేట్లో ఫుడ్‌కు బదులు చాక్లెట్స్ బిళ్లలతో బ్రెయిలీ లిపిలో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ రాసిపెట్టాడు.
ఇవేమీ తెలీని యువతి యథాప్రకారం, తన ఫోర్క్‌ను ఫ్లేట్లో పెట్టగానే అందులో ఏమీ లేదని ఆమెకు అర్థమవుతుంది. దీంతో, షాకైన ఆమె చేతులతో ప్లేట్లో తడిమి చూడగా బ్రెయిలీలో రాసున్న ప్రశ్న ఆమె చదువుతుంది. తనను పెళ్లి చేసుకుంటావా అని బాయ్‌ఫ్రెండ్ సర్ప్రైజ్ చేస్తూ అడిగాడని తెలియగానే ఆమె ఉబ్బితబ్బిబ్బైపోతుంది. నాకీ పెళ్లి ఓకే అంటూ పలుమార్లు సంబరంతో చెబుతుంది. ఆ తరువాత వారిద్దరూ ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు.
Viral: ఎంత మోసం.. మంచానపడ్డ భర్తకు సేవలు చేసి కోలుకునేలా చేస్తే..
వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. యువకుడిది నిస్వార్థ ప్రేమ అంటూ వేనోళ్లపొగిడారు. ఈకాలంలో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారంటే నిజంగా గ్రేటే అని, క్షణాల్లో బ్రేకప్ చెప్పేసే ఈకాలం జంటలకంటే వీళ్లు ఎంతో మెరుగని కొందరు కామెంట్ చేశారు. అతడు ఆమెను సర్ప్రైజ్ చేసిన విధానం బాగుందని కొందరు అన్నారు. ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న అతడికి యువతిపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమైపోతోందని కామెంట్ చేశారు.
కొందరు మాత్రం ఈ వీడియోపై పెదవి విరిచారు. ఇదంతా ఫేక్ అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీడియో వెనక అసలు కారణాలు తెలీకుండా ఓ నిర్ణయానికి రాలేమని అన్నారు. ఇలా వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా వ్యూస్ మాత్రం విపరీతంగా వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకూ 16 లక్షల వ్యూస్, వేల కొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. మరి ఈ ఇంటరెస్టింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Viral: జపాన్ వీధుల పరిశుభ్రతను పరీక్షించిన భారతీయ యువతి! రిజల్ట్స్ చూసి షాక్
Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన
Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం